• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • SRI LANKA SOLD 2011 CRICKET WORLD CUP FINAL SAYS FORMER SPORTS MINISTER SK

మేం అమ్ముడుపోవడం వల్లే భారత్‌కు వరల్డ్ కప్.. లంక మాజీ మంత్రి సంచలనం

మేం అమ్ముడుపోవడం వల్లే భారత్‌కు వరల్డ్ కప్.. లంక మాజీ మంత్రి సంచలనం

2011లో టీమిండియా వరల్డ్ కప్ విజయోత్సాహం

గతంలో అర్జున రణతుంగే సైతం ఇలాంటి ఆరోపణలే చేశారు. ఆ మ్యాచ్‌లో కామెంట్రేటర్‌గా ఉన్న ఆయన.. ఫైనల్ మ్యాచ్‌పై విచారణ జరగాలని 2017లో డిమాండ్ చేశారు.

  • Share this:
    2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌పై శ్రీలంక మాజీ క్రీడాశాఖ మంత్రి మహిందనంద అలుత్గమగే సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అమ్ముడుపోవడం వల్లే భారత్ గెలిచి.. ప్రపంచకప్‌ను అందుకుందని బాంబు పేల్చారు. సిరసా టీవీతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు లంక మాజీ మంత్రి. తాను క్రీడాశాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఇది జరిగిందని చెప్పారు. దీని వెనక కొన్ని శక్తులు ఉన్నాయని మహిందనంద అన్నారు.

    నేను ఇవాళ చెబుతున్నా వినండి. 2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు గెలవాల్సి ఉంది. కానీ భారత్‌కు అమ్ముడుపోయాం. నేను క్రీడల మంత్రిగా ఉన్నా. ఈ విషయం అప్పుడే నాకు తెలుసు. కానీ బయటపెట్టదలచుకోలేదు. క్రీడాకారులను ఇందులోకి లాగడం లేదు. కానీ కొన్ని వర్గాల హస్తముంది.
    మహిందనంద అలుత్గమగే


    2010-2015లో క్రీడాశాఖ మంత్రిగా పనిచేసిన ఆయన.. ప్రస్తుతం విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఐతే గతంలో అర్జున రణతుంగే సైతం ఇలాంటి ఆరోపణలే చేశారు. ఆ మ్యాచ్‌లో కామెంట్రేటర్‌గా ఉన్న ఆయన.. ఫైనల్ మ్యాచ్‌పై విచారణ జరగాలని 2017లో డిమాండ్ చేశారు. అర్జున రణతుంగే 1996లో వరల్డ్ కప్ గెలిచిన లంక జట్టుకు కెప్టెన్‌గా ఉన్నారు. ఇద్దరు ప్రముఖులు ఈ తరహా ఆరోపణలు చేయడం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది.

    కాగా, 2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఇండియా, శ్రీలంక మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన లంక 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 18 పరుగులకే ఔటయ్యారు.
    గంభీర్ 97, ధోనీ 91 పరుగులతో రాణించడంతో టీమిండియా గెలిచి.. ప్రపంచ కప్‌ను ముద్దాడింది. బలహీనమైన బౌలింగ్, చెత్త ఫీల్డింగ్ వల్లే భారత్ గెలించిందని నాటి లంక కెప్టెన్ సంగరక్కపై తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు లంక క్రికెట్ అభిమానులు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు