SRI LANKA CRISIS EX CRICKETERS SANATH JAYASURIYA AND ARJUNA RANATUNGA THANKS INDIA PRIME MINISTER NARENDRA MODI FOR HELPING THEIR COUNTRY SRD
Sri Lanka Crisis : కష్టమొచ్చినప్పుడల్లా ఆదుకుంటుంది.. అందుకే భారత్ మా పెద్దన్న : సనత్ జయసూర్య
Sanath Jayasuriya
Sri Lanka Crisis : ప్రస్తుతం లంకలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లంక తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా నిత్యావసరాలకు తీవ్రంగా కొరత ఏర్పడటం, ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు అల్లాడుతున్నారు.
శ్రీలంకలో ఆర్థిక, ఆహార, రాజకీయ సంక్షోభం (Sri Lanka Crisis) మరింత తీవ్రతరమైంది. సైన్యం, పోలీసులు చేతిలో ఉన్నా దేశాన్ని నడపలేని నిస్సహాయ స్థితిలో పాలకులు ఉంటే.. కనీస అవసరాలకు సరుకులు దొరక్క సామాన్యుల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై లంకేయులు ఆందోళనలకు దిగారు. రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. ప్రస్తుతం లంకలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లంక తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా నిత్యావసరాలకు తీవ్రంగా కొరత ఏర్పడటం, ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు అల్లాడుతున్నారు. కేజీ బియ్యం ధర మన కరెన్సీలో రూ.220కాగా, గోధుమల ధర రూ.190కి చేరింది. చక్కెర కేజీ రూ.240, కొబ్బరి నూనె లీటరు ధర రూ.850, ఒక కోడిగుడ్డు రూ.30, కేజీ మిల్క్ పౌడర్ ధర రూ.1,900గా ఉంది. కల్లోల శ్రీలంకకు భారత్ భారీ సహాయాన్ని అందిస్తున్నది. 2.5 బిలియన్ డాలర్ల సాయంతో పాటు లక్షల టన్నుల ఇంధనాన్ని, వేల క్వింటాల బియ్యాన్ని పంపింది. మరోవైపు... కొలంబోకు విమానాల రాకపోకలను తగ్గించాలని ఎయిరిండియా నిర్ణయించింది. ప్రస్తుతం ఢిల్లీ, చెన్నై నుంచి కొలంబోకు వారంలో 16 సర్వీసులు తిరుగుతున్నాయి.
ఇదిలా ఉండగా.. ఈ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు భారత్ తన వంతు సాయం అందిస్తోంది. ఇప్పటికే భారీ స్థాయిలో బియ్యం, డిజిల్, మందులను శ్రీలంకకు భారత్ సరఫరా చేసింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తమ దేశానికి చేస్తున్న ఈ సాయంపై శ్రీలంక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కష్టకాలంలో తమకు సాయం చేసిందుకు భారత్కు, ప్రధాని మోదీకి శ్రీలంక మాజీ క్రికెటర్లు సనత్ జయసూర్య, అర్జున రణతుంగ కృతజ్ఞతలు తెలిపారు.
లంకకు కష్టమెచ్చినప్పుడల్లా భారత్ ఎప్పుడూ మాకు పెద్దన్నలా సాయం చేస్తూ వస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోదీకి మేమెంతో రుణపడి ఉంటాం. లంకలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు చాలా అధ్వాన్నంగా ఉన్నాయి. భారత్ సహా ఇతర దేశాలు తమ దేశాన్ని ఆదుకుంటే బాగుంటుందని, అప్పుడే ఈ గడ్డు పరిస్థితుల నుంచి బయటపడగలమని భావిస్తున్నామని జయసూర్య అభ్యర్థించాడు.ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రీలంకలో బతకడం అంత ఈజీ కాదని షాకింగ్ కామెంట్స్ చేశారు. విద్యుత్ సరఫరా లేకపోవడం, ఆహార కొరత, పెట్రోల్, డీజిల్ కొరత వల్ల లంకేయులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారని అన్నారు.
మరో మాజీ క్రికెటర్, మంత్రి అర్జున రణతుంగ కూడా భారత్ సాయాన్ని ప్రశంసించారు. భారత్ సాయాన్ని ఎప్పుడూ మరిచిపోలేమని అన్నారు. లంక పరిస్థితులను తెలుసుకుని పొరుగుదేశమైన తమకు సాయం చేసినందుకు చాలా సంతోషంగా ఉందని రణతుంగ అన్నారు.
పెట్రోల్, డీజిల్, మందులు, బియ్యం వంటి నిత్యావసర వస్తువులను భారత్ పంపుతూ సాయాన్ని అందిస్తోందని ఆయన కొనియాడారు. లంక క్రికెటర్లలో కుమార సంగక్కర, మహేల జయవర్దెనె, భానుక రాజపక్స, లసిత్ మలింగ కూడా సోషల్ మీడియా వేదికగా తమ దేశ పరిస్థితులపై స్పందించారు. లంక ప్రజలకు సాయం అందించి పొరుగు దేశాలు ఆదుకోవాలని లంక క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా అభ్యర్థించారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.