హోమ్ /వార్తలు /క్రీడలు /

Sri Lanka Crisis : అప్పుడు ప్రపంచకప్ గెలిచాడు.. ఇప్పుడు శ్రీలంకలో టీ సర్వ్ చేస్తున్నాడు..

Sri Lanka Crisis : అప్పుడు ప్రపంచకప్ గెలిచాడు.. ఇప్పుడు శ్రీలంకలో టీ సర్వ్ చేస్తున్నాడు..

PC TWITTER

PC TWITTER

Sri Lanka Crisis : శ్రీలంక (Sri Lanka)లో ఆర్థిక సంక్షోభం ఇంకా సద్దుమణగలేదు. పాలకులు తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగా శ్రీలంక ప్రస్తుతం అప్పుల్లో కూరుకుపోయింది. విదేశీ మారకం లేకపోవడంతో విదేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకోలేకపోతుంది.

ఇంకా చదవండి ...

Sri Lanka Crisis : శ్రీలంక (Sri Lanka)లో ఆర్థిక సంక్షోభం ఇంకా సద్దుమణగలేదు. పాలకులు తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగా శ్రీలంక ప్రస్తుతం అప్పుల్లో కూరుకుపోయింది. విదేశీ మారకం లేకపోవడంతో విదేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకోలేకపోతుంది. సంక్షోభంతో దేశంలో కరెంటు కష్టాలు, డీజిల్, పెట్రోల్ కష్టాలు ఎక్కువయ్యాయి. పలు చోట్ల హింసాత్మక సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ప్రధాని, అధ్యక్ష భవనాలను ఆందోళకారులు ముట్టడించారు కూడా. లీటర్ పెట్రోల్ కోసం గంటలు తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ప్రస్తుతం శ్రీలంకలో నెలకొని ఉంది.

ఇది కూడా చదవండి : వేసింది 4 బంతులు.. ఇచ్చింది 92 పరుగులు.. బౌలర్ కు కోపం వస్తే అంతే మరీ..

భారత్ వేదికగా జరిగిన 1996 ప్రపంచకప్ లో శ్రీలంక విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. రోషన్ మహనామా ప్రపంచకప్ గెలిచిన శ్రీలంక జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అప్పుడు ప్రపంచకప్ గెలిచిన ఈ క్రికెటర్ ఇప్పుడు శ్రీలంకలోని పెట్రోల్ బంకుల దగ్గర టీ, స్నాక్స్ లను సర్వ్ చేస్తూ కనిపించాడు. అయితే తన బతుకు తెరువు కోసం రోషన్ ఇదంతా చేయడం లేదు. సాయంగా చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. లీటర్ పెట్రోల్ లేదా డీజిల్ కోసం పెట్రోల్ బంకుల దగ్గర గంటలకు గంటలు వేచి చూడాల్సిన పరిస్థితిలో శ్రీలంక ప్రజలు ఉన్నారు. దాంతో విజేరమ మవాత వార్డ్ పరిధిలోని పెట్రోల్ బంకుల దగ్గర నిరీక్షిస్తోన్న ప్రజలకు తన టీంతో కలిసి రోషన్ మహనామా టీ, స్నాక్స్ ను సర్వ్ చేశాడు. వీటికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు.

’పెట్రోల్ బంకుల దగ్గర నిరీక్షిస్తోన్న ప్రజలకు మేము టీ, స్నాక్స్ లను సర్వ్ చేశాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల దేశంలో లీటర్ డీజిల్ కోసం గంటలు గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. దాంతో నేను మా టీంతో కలిసి వారికి ఆహారాన్ని అందించాం‘అని రోషన్ తెలిపాడు. పెట్రోల్ కోసం వచ్చే వారు తమ వెంట ఆహారాన్ని తీసుకొని రావాల్సిందిగా అతడు ప్రజలకు విజ్ణప్తి చేశాడు. రోషన్ మహనామా తన కెరీర్ లో 52 టెస్టు మ్యాచ్ లు ఆడి 2576 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉండటం విశేషం. వన్డేల్లో 213 మ్యాచ్ ల్లో 5162 పరుగులు చేశాడు. ప్రస్తుతం రోషన్ మహనామా ఐసీసీ రెఫరీగా కొనసాగుతున్నాడు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Crisis, Financial crisis, India vs South Africa, Sri Lanka

ఉత్తమ కథలు