హోమ్ /వార్తలు /క్రీడలు /

ICC Cricket World Cup 2019: శ్రీలంకను ఆదుకున్న మథ్యూస్.. స్కోరు వివరాలివీ..

ICC Cricket World Cup 2019: శ్రీలంకను ఆదుకున్న మథ్యూస్.. స్కోరు వివరాలివీ..

శ్రీలంక ఆటగాడు మథ్యూస్(85*)

శ్రీలంక ఆటగాడు మథ్యూస్(85*)

ICC CRICKET WORLD CUP 2019 | ENG VS SL | శ్రీలంక జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లు కేవలం 232 పరుగులు చేసింది. 3 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఆ జట్టును సీనియర్ ఆటగాడు మథ్యూస్ (85*), అవిష్క ఫెర్నాండో(49), కుశాల్ మెండిస్(46) ఆదుకున్నారు.

ఇంకా చదవండి ...

ఇంగ్లండ్, శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లు కేవలం 232 పరుగులు చేసింది. 3 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఆ జట్టును సీనియర్ ఆటగాడు మథ్యూస్ (85*), అవిష్క ఫెర్నాండో(49), కుశాల్ మెండిస్(46) ఆదుకున్నారు. మిగతావారిలో ధనంజయ(29) తప్పా మిగతావారంతా సింగిల్ డిజిట్‌లకే పరిమితమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్ 3 వికెట్లు, మార్క్ వుడ్ 3 వికెట్లు, ఆదిల్ రషీద్ 2 వికెట్లు వోక్స్ ఒక వికెట్ దక్కించుకున్నారు. 233 పరుగుల లక్ష్యంతో ఇంగ్లండ్ బరిలోకి దిగనుంది. కాగా, ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించి 8 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఐదు మ్యాచ్‌లాడిన లంక ఒకదాంట్లో గెలిచి.. రెండింటిలో ఓడిపోయింది. వర్షం కారణంగా రెండు మ్యాచ్‌లు రద్దు కావడంతో 4 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.

First published:

Tags: Cricket, Cricket World Cup 2019, England, ICC, ICC Cricket World Cup 2019, Sri Lanka

ఉత్తమ కథలు