Sri Lanka T20 world cup squad : ఆస్ట్రేలియా (Australia) వేదికగా ఆరంభమయ్యే టి20 ప్రపంచకప్ (T20 World Cup)కు నెల రోజుల కంటే తక్కువ సమయం ఉంది. ఇప్పటికే చాలా జట్లు టి20 ప్రపంచకప్ కోసం జట్లను కూడా ప్రకటించాయి. ఇక తాజాగా ఈ జాబితాలో ఆసియాకప్ (Asia cup) 2022 చాంపియన్ శ్రీలంక (Sri Lanka) కూడా చేరింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టును శ్రీలంక శుక్రవారం ప్రకటించింది. దాసున్ షనక కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. గాయాలతో ఆసియా కప్ కు దూరమైన దుష్మంత చమీర.. లహిరు కుమారలు తిరిగి జట్టులోకి పునరాగమనం చేశారు. అయితే వీరు ఆస్ట్రేలియా ఫ్లయిట్ ఎక్కాలంటే మాత్రం ఫిట్ నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. ఆసియా కప్ లో భాగంగా ఉన్న దినేశ్ చండీమల్ ను స్టాండ్ బై ప్లేయగా శ్రీలంక క్రికెట్ చేర్చింది.
ఆత్మ విశ్వాసంతో
ఆసియా కప్ లో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి చాంపియన్ గా నిలిచిన జట్టు శ్రీలంక. ఆరోసారి ఆసియా కప్ ను శ్రీలంక సొంతం చేసుకుంది. ఇది ఆ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. దాసున్ షనక నాయకత్వంలో శ్రీలంక సమష్టిగా రాణిస్తుంది. అటు బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో జట్టు కలిసి కట్టుగా ఆడి అద్భుతాలను సాధిస్తోంది. ఆసియా కప్ ప్రదర్శనను ఆస్ట్రేలియాలో కూడా పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది.
ర్యాంకింగ్స్ ద్వారా శ్రీలంక జట్టు సూపర్ 12కు చేరుకోలేకపోయింది. దాంతో గ్రూప్ స్టేజ్ ను ఆడాల్సి ఉంది. అక్టోబర్ 16 నుంచి 21 వరకు గ్రూప్ స్టేజ్ జరగనుంది. గ్రూప్ ‘ఎ’లో ఉన్న శ్రీలంక.. నమీబియా, నెదర్లాండ్స్, యూఏఈలతో మ్యాచ్ లను ఆడనుంది. అక్టోబర్ 16న నమీబియాతో, 28న యూఏఈతో, 20న నెదర్లాండ్స్ తో శ్రీలంక మ్యాచ్ లను ఆడనుంది. గ్రూప్ స్టేజ్ లో రెండు గ్రూప్స్ నుంచి టాప్ 2లో నిలిచిన నాలుగు జట్లు సూపర్ 12కు అర్హత సాధిస్తాయి. సూపర్ 12 దశ అక్టోబర్ 22 నుంచి ఆరంభం కానుంది.
Here's your ???????? squad for the ICC Men's T20 World Cup! ⬇️#RoaringForGlory #T20WorldCup pic.twitter.com/GU7EIl6zOw
— Sri Lanka Cricket ???????? (@OfficialSLC) September 16, 2022
శ్రీలంక టి20 ప్రపంచకప్ జట్టు
షనక (కెప్టెన్), కుశాల్ మెండీస్, నిసాంక, అసలంక, గుణతిలక, రాజపక్స, ధనంజయ డిసిల్వా, హసరంగ, దుష్మంత చమీర, లహిరు కుమార, తీక్షణ, జెఫ్రీ, మదుశంక, మధుషాన్, కరుణ రత్నే
స్టాండ్ బై ప్లేయర్స్
దినేశ్ చండీమల్, యాషెన్ బండార, జయవిక్రమ, బినుర ఫెర్నాండో, నువనీదు ఫెర్నాండో
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Asia Cup 2022, India vs australia, Rohit sharma, Sri Lanka, T20 World Cup 2022, Team India, Virat kohli