SRH VS RR: రాజస్థాన్ బౌలింగ్ దెబ్బకు చేతులెత్తేసిన హైదరాబాద్...రాయల్స్ లక్ష్యం 161 పరుగులు

(Image : Twiter)

వార్నర్ ఔట్ అయిన తర్వాత సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్ వరుసపెట్టి ఔటయ్యారు. కేవలం 25 పరుగుల తేడాతో ఏకంగా 6 వికెట్లు కోల్పోయింది. దీంతో కేవలం 160 పరుగులకే సన్ రైజర్స్ టీమ్ పరిమితమైంది.

  • Share this:
    రాజస్థాన్ రాయల్స్ తో తలపడిన సన్ రైజర్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ తొలి నుంచి తడబడుతూ ఆడింది. తొలి వికెట్ రూపంలో కెప్టెన్ విలియమ్సన్ వెనుతిరగగా, ఆ తర్వాత వచ్చిన మనీష్ పాండే మాత్రం కేవలం 36 బంతుల్లోనే 61 పరుగులు చేసి స్కోరు బోర్డను పరిగెత్తించే ప్రయత్నం చేశాడు. అలాగే టోర్నీలో ఆరెంజ్ క్యాప్ తో పరుగుల్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న డేవిడ్ వార్నర్ భారీ ఇన్నింగ్స్ నిర్మించలేకపోయాడు. 37 పరుగులు మాత్రమే చేసి వెనుతిరిగాడు. వార్నర్ ఔట్ అయిన తర్వాత సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్ వరుసపెట్టి ఔటయ్యారు. కేవలం 25 పరుగుల తేడాతో ఏకంగా 6 వికెట్లు కోల్పోయింది. దీంతో కేవలం 160 పరుగులకే సన్ రైజర్స్ టీమ్ పరిమితమైంది.
    First published: