SRH vs RR: పరువు కోసం ఎస్ఆర్‌హెచ్.. ప్లేఆఫ్స్ కోసం రాజస్థాన్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ (PC: IPL)

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టులో భారీ మార్పులు చేసింది.

 • Share this:
  ఐపీఎల్ 2021లో (IPL 2021) భాగంగా ఇవాళ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) - రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) మధ్య మ్యాచ్ జరుగుతున్నది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నది. ప్లేఆఫ్స్ చేరాలంటే రాజస్థాన్ జట్టు మిగిలిన మ్యాచ్‌లు గెలవాల్సిన పరిస్థితి ఉన్నది. 'వాతావరణం, పిచ్ స్వభావాన్ని చూసిన తర్వాత తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ రోజు కార్తీక్ త్యాగీ ఫిట్‌నెస్ కారణాల వల్ల జట్టులో లేడు. యువకులతో కూడిన మా జట్టు గత ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నాము. తప్పకుండా విజయం సాధిస్తామని భావిస్తున్నాను' అని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samsaon) అన్నాడు.

  ఇక 9 మ్యాచ్‌లలో ఏకంగా 8 మ్యాచ్‌లు ఓడిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పరువు కోసం మిగిలిన మ్యాచ్‌లు గెలవాలని భావిస్తున్నది. ఈ రోజు జట్టులో భారీ మార్పులు చేసినట్లు కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ (Kane Williamson) అన్నాడు. డేవిడ్ వార్నర్ బదులుగా జేసన్ రాయ్‌ని జట్టులోకి తీసుకున్నారు. అతడితో పాటు బెంచ్‌పైన్ ఉన్న యువ క్రికెటర్లు ప్రియమ్ గార్గ్, అభిషేక్ వర్మ జట్టులోకి వచ్చారు. మనీశ్ పాండే, కేదార్ జాదవ్‌ను తప్పించారు.

  సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్లేఆఫ్స్ వెళ్లే అవకాశాలు దాదాపుగా లేవు. అయితే మిగిలిన మ్యాచ్‌లు అన్నీ గెలిస్తే ఇరత జట్ల ప్లేఆఫ్స్ అవకాశాలపై భారీగా ప్రభావం పడే అవకాశం ఉన్నది.
  Published by:John Naveen Kora
  First published: