IPL 2023 : ఐపీఎల్ 2023 (IPL 2023)లో భాగంగా రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals)తో జరుగుతున్న పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) బౌలర్ ఉమ్రాన్ మాలిక్ రెచ్చిపోయాడు. స్పీడ్ బౌలింగ్ తో రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్ దేవ్ దత్ పడిక్కల్ కు వణుకు పుట్టించాడు. 15వ ఓవర్ వేయడానికి వచ్చిన ఉమ్రాన్ మాలిక్.. తొలి బంతికే పడిక్కల్ పని పట్టాడు. 149.2 కిలోమీటర్లతో వచ్చిన ఇన్ స్వింగర్ ను పడిక్కల్ ఆడటంలో పూర్తిగా తడబడ్డాడు. బుల్లెట్ లా దూసుకొచ్చిన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కేవలం 2 పరుగులు మాత్రమే చేసిన పడిక్కల్ పెవిలియన్ కు చేరుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసింది. కెప్టెన్ సంజూ సామ్సన్ (32 బంతుల్లో 55; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), జాస్ బట్లర్ (22 బంతుల్లో 54; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), యశస్వి జైస్వాల్ (37 బంతుల్లో 54; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలతో మెరిశారు. సన్ రైజర్స్ బౌలర్లలో నటరాజన్, ఫరూఖీలు చెరో రెండు వికెట్లు సాధించారు. ఉమ్రాన్ మాలిక్ ఖాతాలో ఒక వికెట్ చేరింది.
.@umran_malik_01 doing Umran Malik things! ???? Relive how he picked his first wicket of the #TATAIPL 2023 ????#SRHvRR | @SunRisers pic.twitter.com/QD0MoeW1vF
— IndianPremierLeague (@IPL) April 2, 2023
టాస్ నెగ్గిన సన్ రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన రాజస్తాన్ జట్టుకు బట్లర్, జైస్వాల్ ధనాధన్ శుభారంభం చేశారు. ముఖ్యంగా బట్లర్ బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో ఉన్న జైస్వాల్ కూడా బట్లర్ తో పోటీ పడి మరీ పరుగులు సాధించారు. దాంతో పవర్ ప్లేలోనే రాజస్తాన్ రాయల్స్ ఏకంగా 85 పరుగులు సాధించింది. అయితే 6వ ఓవర్లో ఫరూఖీ సూపర్ బాల్ తో బట్లర్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. వన్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ సంజూ సామ్సన్ కూడా రెచ్చిపోయి ఆడాడు. దాంతో రాజస్తాన్ 10 ఓవర్లలో ఒక వికెట్ కు 122 పరుగులకు చేరుకుంది. ఈ దశలో రాజస్తాన్ 250కు పైగా పరుగులు చేస్తుందేమో అనిపించింది.
ఇది కూడా చదవండి : తొలి మ్యాచ్ లో తుస్సుమన్న లక్నో సూపర్ జెయింట్స్ పోటుగాడు.. ఇలాగైతే కష్టమే
అయితే చివర్లో సన్ రైజర్స్ బౌలర్లు సూపర్ కమ్ బ్యాక్ చేశారు. చివర్లో నటరాజన్, ఆదిల్ రషీద్, ఫరూఖీలు మంచి బౌలింగ్ ప్రదర్శన చేశారు. ముఖ్యంగా నటరాజన్ సూపర్ అనిపించుకున్నాడు. తొలి ఓవర్లో 17 పరుగులు సమర్పించుకున్న నటరాజన్.. తన చివరి 2 ఓవర్లలో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చుకున్నాడు. కీలక సమయంలో అభిషేక్ శర్మ పట్టిన సూపర్ క్యాచ్ కు సంజూ సామ్సన్ వెనుదిరిగాడు. తొలి 10 ఓవర్లలో 122 పరుగులు సమర్పించుకున్న సన్ రైజర్స్.. చివరి 10 ఓవర్లలో కేవలం 81 పరుగులు మాత్రమే ఇచ్చుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IPL, IPL 2023, Rajasthan Royals, SRH, Sunrisers Hyderabad