SRH vs RR Live Scores : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (IPL 2023)లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) వేట మొదలుకానుంది. హైదరాబాద్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకుంది. రెగ్యులర్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ తో పాటు హెన్రిచ్ క్లాసెన్, మార్కో యాన్సెన్ లు ఈ మ్యాచ్ కు దూరమయ్యారు. ఇక ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ తరఫున విదేశీ ప్లేయర్ల జాబితాలో హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫెలిప్స్, రషీద్, ఫరూఖీలు బరిలోకి దిగనున్నారు. హ్యారీ బ్రూక్ కు ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్ కాగా.. సన్ రైజర్స్ తరఫున ఆదిల్ రషీద్ అరంగేట్రం చేయనున్నాడు. రాజస్తాన్ రాయల్స్ తరఫున విదేశీ ప్లేయర్లుగా జాస్ బట్లర్, హెట్ మైర్, హోల్డర్, ట్రెంట్ బౌల్ట్ లు బరిలోకి దిగనున్నారు.
రాత మార్చాలని
గత రెండు సీజన్లలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. 2021లో ఆఖరి స్థానంలో నిలిచిన హైదరాబాద్.. 2022లో 8వ స్థానంలో నిలిచింది. అయితే ఈ సీజన్ లో మాత్రం దుమ్ముదులిపేందుకు సిద్ధమైంది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా సమద్ లేదా వివ్రాంత్ ను సన్ రైజర్స్ ఉపయోగించే అవకాశం ఉంది. ఇక గత సీజన్ లో రన్నరప్ గా నిలిచిన రాజస్తాన్ రాయల్స్ ఈసారి కప్పు కొట్టాలని పట్టుదలగా ఉంది. గాయం నుంచి కోలుకున్న సంజూ సామ్సన్ పరుగులు చేసేందుకు సిద్దమయ్యాడు. జాస్ బట్లర్, సామ్సన్, పడిక్కల్, యశస్విలతో రాజస్తాన్ రాయల్స్ బ్యాటింగ్ బలంగా ఉంది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా సైనీని రాజస్తాన్ ఉపయోగించే అవకాశం ఉంది. ఇక నెదర్లాండ్స్ తో సౌతాఫ్రికా వన్డే సిరీస్ కారణంగా ఐపీఎల్ తొలి మ్యాచ్ కు రెగ్యులర్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ తో పాటు హెన్రిచ్ క్లాసెన్, మార్కో యాన్సెన్ లు దూరమయ్యారు.
తుది జట్లు
రాజస్తాన్ రాయల్స్
సంజూ సామ్సన్ (కెప్టెన్), బట్లర్, యశస్వి జైస్వాల్, పడిక్కల్, హెట్ మైర్, పరాగ్, హోల్డర్, అశ్విన్, బౌల్ట్, చహల్, ఆసిఫ్
ఇంపాక్ట్ ప్లేయర్స్ : జురైల్, సందీప్, మురుగన్ అశ్విన్, సైని, డోవోన్ ఫెరీరా
సన్ రైజర్స్ హైదరాబాద్
భువనేశ్వర్ కుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, హ్యారీ బ్రూక్, వాషింగ్టన్ సుందర్, ఆదిల్ రషీద్, ఉమ్రాన్ మాలిక్, ఫరూఖి, నటరాజన్
ఇంపాక్ట్ ప్లేయర్స్ : సమద్, వివ్రాంత్, దగర్, ఉపేంద్ర
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IPL, IPL 2023, Rajasthan Royals, Sanju Samson, SRH, Sunrisers Hyderabad