Home /News /sports /

SRH VS RCB NEHARA SLAMMED MANISH PANDEY LOSING HIS WICKET LIKE A TAIL ENDER SA

మనీష్ 30 బంతులు ఆడితే సన్‌రైజర్స్ ఓటమి ఖాయం.. అన్ని బాల్స్ డాట్ చేస్తాడా!

manish pandey

manish pandey

బ్యాట్స్‌మన్ మనీష్ పాండే కారణమంటూ పలువురు మండిపడుతున్నారు. తాజాగా టీమిండియా దిగ్గజ బౌలర్ ఆశిష్ నెహ్రా కూడా అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

    సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస ఓటములకు  బ్యాట్స్‌మన్ మనీష్ పాండే కారణమంటూ పలువురు మండిపడుతున్నారు. తాజాగా టీమిండియా దిగ్గజ బౌలర్ ఆశిష్ నెహ్రా కూడా అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జరిగిన   మ్యాచ్‌లో పాండే ఆట తీరు సరిగాలేదున్నారు.సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస ఓటములకు  బ్యాట్స్‌మన్ మనీష్ పాండే కారణమంటూ పలువురు మండిపడుతున్నారు. తాజాగా టీమిండియా దిగ్గజ బౌలర్ ఆశిష్ నెహ్రా కూడా అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జరిగిన   మ్యాచ్‌లో పాండే ఆట తీరు సరిగాలేదున్నారు. జట్టు గెలిపించాల్పిన మ్యాచ్‌లో బాధ్యత మరిచి ఆడరాన్నారు. నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకుని జట్టు ఓటమికి కారణమయాడన్నారు. ఈ తరహా ఆట తీరుతోనే టీమిండియాలో తన స్థానాన్ని  కోల్పోయాడంటూ మండిపడ్డారు ఇక బుధవారం బెంగళూర్ జరిగిన మ్యాచ్‌లో గెలవాల్సిన టైంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటములకు మనీష్ పాండే కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. స్ట్రైక్‌రేట్ చాలా దారుణంగా ఉందని మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు.

    తాజాగా ఈ విషయంపై క్రిక్‌బజ్‌తో మాట్లాడిన నెహ్రా.. మనిష్‌పై మండిపడ్డారు. అతని ఒత్తిడిని అధిగమించే సామర్థ్యం లేదన్నారు. ఆ మ్యాచ్‌లో సరైనా సమయంలో కోహ్లీ లెగ్ స్పీన్నర్ అస్త్రాన్ని వాడాడు. షబాజ్ అహ్మద్‌ మంచి బంతులతో సరైనా ఫలితాన్ని రాబట్టాడు. అతని బౌలింగ్‌లో  హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్ స్టో, మనీష్ పాండే, అబ్దుల్ సమాద్ ఔటైన సరిగా లేదు. వారు ఆడిన తీరు ఏమాత్రం బాగాలేదు. వారి బ్యాటింగ్  టెయిలండర్స్‌లు ఆడిన తీరులా ఉంది. మనీష్ పాండే ఔటైన విధానం మాత్రం విస్మయపరిచిందని ' ఆశిష్ నెహ్రా చెప్పుకొచ్చాడు.

    సన్‌రైజర్స్‌లో ఓ సెంటీమెంట్ కొనసాగుతుంది. మనీశ్‌ పాండే ఎక్కువ పరుగులు మ్యాచ్‌లలో ఎక్కువగా  సన్‌రైజర్స్‌ ఓటమిపాలైంది. గతంలో ఫస్ట్ డౌన్‌లో దిగిన అతను ఎక్కువ బంతులు ఆడకుండానే నిష్ర్కమించేవాడు.  30 బంతులకు పైగా ఆడిన మ్యాచులలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ దాదాపు ఓటమిని చవిచూసేది. ఐపీఎల్  2018 సీజన్‌లో అతను  14 మ్యాచుల్లో 30 పైగా బంతులు ఆడగా అందులో 11 సార్లు  సన్‌రైజర్స్ ఓటిమి పాలైంది.. ఎస్‌ఆర్‌హెచ్‌కి  మనీష్‌ గత నాలుగు సీజన్లు నుంచి కలిసి రావడం లేదు.  బెంగళూరుపై అతను 39 బంతుల్లో 38 పరుగులు చేశాడు. అతను ఎదుర్కొన్న బంతుల్లో ఎక్కువగా డాట్ బాల్స్ కనిపిస్తున్నాయి. ఇలానే కోల్‌కతాపై కూడా నెమ్మదిగా ఆడాడు.
    Published by:Rekulapally Saichand
    First published:

    Tags: IPL 2021, Manish pandey

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు