SRH vs PBKS: సత్తా చాటిన సన్‌రైజర్స్ బౌలర్లు.. తడబడిన పంజాబ్ బ్యాట్స్‌మాన్.. హైదరాబాద్ టార్గెట్ ఎంతంటే

పంజాబ్ జట్టును 125 పరుగులకే కట్టడి చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (PC: IPL)

ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌పై మరోసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు సత్తా చాటారు. పిచ్‌ సహకారాన్ని ఉపయోగించుకొని బలమైన పంజాబ్ బ్యాటింగ్ లైనప్‌ను పడగొట్టారు.. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ జట్టు కేవలం 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులే చేసింది.

  • Share this:
    ఐపీఎల్ 2021 (IPL 2021) సీజన్‌లో తొలి సారి సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) బౌలర్లు సత్తా చాటారు. ఈ సీజన్‌లో పంజాబ్‌పై (Punjab Kings) మాత్రమే విజయం సాధించిన హైదరాబాద్ జట్టు.. తిరిగి అదే జట్టుపై ఆధిపత్యం చెలాయించింది. సన్‌రైజర్స్ బౌలర్లు చెలరేగడంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి కేవలం 125 పరుగులే చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ జట్టుకు సరైన ఆరంభం లభించలేదు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (21) (KL Rahul) వరుస బౌండరీలతో దూకుడుగా కనిపించినా.. జాసస్ హోల్డర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఇక మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (5) పూర్తిగా నిరాశ పరిచాడు. విధ్వంసకర బ్యాట్స్‌మాన్ క్రిస్ గేల్ (14)ను (Chris Gayle) రషీద్ ఖాన్ (Rashid Khan) ఎల్బీడబ్ల్యూగా పెవీలియన్ పంపించాడు. మార్క్‌రామ్ (27) పర్వాలేదనిపించినా.. నికోలస్ పూర్ (8) అనసవరంగా వికెట్ పారేసుకున్నాడు. దీపక్ హుడా (13) మరోసారి విఫలమయ్యాడు. వరుసగా వికెట్లు పడుతుంటే పంజాబ్ జట్టు కనీసం 100 పరుగులైనా చేరుతుందా అని ఫ్యాన్స్ ఆందోళన చెందారు.

    చివరల్లో హర్‌ప్రీత్ బ్రార్ (18), నాథన్ ఎల్లిస్ (12) కాస్త పరగులు రాబట్టడంతో పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 125 పరుగులు చేసింది. జాసన్ హోల్డర్ 3 వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా పరుగులు ఇచ్చాడు. సందీప్ శర్మ, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, అబ్దుల్ సమద్ తలా ఒక వికెట్ తీసి పంజాబ్ ఆటగాళ్లను అడ్డుకున్నారు.

    IND vs ENG: వచ్చే ఏడాది జులైలో ఏకైక టెస్ట్ ఆడనున్న ఇంగ్లాండ్-ఇండియా.. అది సిరీస్ డిసైడరేనా?









    ఇక ఈ సీజన్‌లో అత్యంత పేలవ ప్రదర్శన చేస్తున్న సన్‌రైజర్స్ విజయం సాధించడానికి ఒక అవకాశం వచ్చింది. వరుసగా విఫలం అవుతున్న డేవిడ్ వార్నర్ ఈ మ్యాచ్‌లో సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు.
    Published by:John Naveen Kora
    First published: