• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • SRH VS KKR LIVE SCORE IPL 2021 SUNRISERS HYDERABAD VS KOLKATA KNIGHT RIDERS KKR WON MATCH SA

SRH vs KKR Live Score: సన్‌రైజర్స్ ఓటమి.. ఎస్‌ఆర్‌హెచ్‌ని ఓడించిన బౌలర్లు!

SRH vs KKR Live Score: సన్‌రైజర్స్ ఓటమి.. ఎస్‌ఆర్‌హెచ్‌ని  ఓడించిన బౌలర్లు!

Manish Pandey

ఐపీఎల్ 2021‌లో చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 10 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.

  • Share this:
    ఐపీఎల్ 2021‌లో చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. హైదరాబాద్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు మాత్రమే చేసింది. కోల్‌కతా నిర్ధేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని చేరుకోవడంలో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాట్స్‌మెన్స్ విఫలమయ్యారు. ఓపెనర్స్ నుంచి హైదరాబాద్‌కు శుభారంభం లభించలేదు. ప్రసిద్ధ్‌ కృష్ణ వేసిన రెండో ఓవర్‌లో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌(3) ఔటయ్యాడు. తర్వాత షకిబ్‌ అల్‌ హసన్‌ వేసిన మూడో ఓవర్‌‌లో తొలి బంతికి సాహా(7) బౌల్డయ్యాడు. దీంతో హైదరాబాద్‌ 10 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. తర్వాత మనీశ్‌, బెయిర్‌స్టో ఇన్నింగ్స్ ముందుకు తీసుకెళ్ళారు. అవకాశం దోరినప్పుడల్లా బెయిర్‌స్టో బౌండరీలు బాదుతూ వచ్చాడు.వరుణ్‌ చక్రవర్తి వేసిన 12 ఓవర్‌లో తొలి బంతిని బెయిర్‌ స్టో(54) సిక్సర్‌గా మలిచి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.





    ఇలాగే దాటిగా ఆడే క్రమంలో కమిన్స్‌ వేసిన ఈ ఓవర్లో చివరి బంతికి బెయిర్‌ స్టోజానీ బెయిర్‌స్టో(55; 40 బంతుల్లో 5x4, 3x6) ఔటయ్యాడు. ఆ తర్వాత సన్‌‌రైజర్స్ క్రమంగా వికెట్లు కోల్పోయింది. తర్వాత వచ్చిన నబీ(14), విజయ్‌ శంకర్‌(11) విఫలమయ్యారు. మనీశ్‌ పాండే(61; 44 బంతుల్లో 2x4, 3x6) మాత్రం తనదైన స్టైల్లో ఆడుతూ హాఫ్ సెంచరీ సాధించాడు. చివర్లో సమద్‌(19; 8 బంతుల్లో 2x6) రెండు సిక్సులు బాది ఆశలు రేపిన అప్పటికే రన్‌రేట్‌ పెరిగిపోవడంతో హైదరాబాద్‌కు ఓటమి తప్పలేదు.
    Published by:Rekulapally Saichand
    First published:

    అగ్ర కథనాలు