ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్లో మరో కీలక పోరు సమయం అసన్నమైంది. చెన్నై వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్,కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనున్నాయి. రెండు జట్లకు ఇది తొలి పోరు కావడంతో విజయంతో టోర్నీలో శుభారంభం చేయాలని చూస్తున్నాయి. చెపాక్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు అస్త్రశస్త్రాలతో బరిలోకి దిగనున్నాయి. ఇక ఆరెంజ్ ఆర్మీ విషయానికి వస్తే ఐపీఎల్ టైటిల్ ఫెవరెట్‌గా బరిలోకి దిగుతుంది. గత సీజన్లో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. ఇప్పుడు కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. టోర్నీలో విజయంతో మంచి స్టార్ట్ ఇవ్వాలని భావిస్తోంది.
మెుదటి నుంచి సన్‌రైజర్స్‌కు కొండంత అండ బౌలింగ్ దళమే. స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తిరిగి జట్టులో చేరడం సన్‌రైజర్స్ సంతోషాన్ని కలిగించే విషయం. అతని తోడుతుగా నటరాజన్,సందీప్ శర్మ ఉన్నారు. ఇక స్పీన్ విభాగంలో సెన్సేషన్ రషీద్ ఖాన్ ఉండనే ఉన్నారు. హైదరాబాద్ అన్ని విభాగాల్లో బలంగా ఉంది. బ్యాటింగ్‌లో కెప్టెన్ డేవిడ్ వార్నర్.. బెయిర్ స్టో స్ట్రాంగ్ ఫిల్డర్స్ కాగా విలియమ్సన్, పాండేతో టాపార్డర్ బలంగానే ఉంది. అదనంగా వృద్దిమాన్ సాహా కూడా అందుబాటులో ఉన్నాడు. ఇలా అన్ని విభాగాల్లో సన్‌రైజర్స్ చాలా బలంగా కనిపిస్తోంది.
ఇక కొల్కతా విషయానికి వస్తే.. ఆ జట్టు ఓపెనర్ శుభ్‌మన్ గిల్ నిలకడైన ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్ 2020లో శుభమన్ గిల్ 440 పరుగులు సాధించాడు. ఇక నితీశ్ రాణా, మెర్గాన్, దినేశ్ కార్తీక్‌లు బ్యాటింగ్‌లో రాణిస్తే కోల్‌కతాకు తిరుగుండదు. మంచి ఫినిషింగ్ ఇవ్వడానికి అండ్రూ రసూల్ ఉండానే ఉన్నాడు. కానీ అతను గత ఐపీఎల్లో దారుణంగా విఫలమయ్యాడు. ఈసారి కొత్తగా జట్టులోకి వచ్చిన షకీబ్ ఆల్‌రౌండ్ పాత్ర ముఖ్యం. బౌలింగ్ విభాగంలో ఫెర్గూసన్, కమిన్స్‌ల మీదనే భారం. స్పీన్లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఉండానే ఉన్నాడు. గతేడాది అతను 17 వికెట్లు సాధించాడు. శివమ్ మావి, కమలేశ్ నాగర్‌కోటిలు తమ బౌలింగ్‌కు పదును పేడితే చాలు.
SRH vs KKR( జట్ల అంచనా )
సన్‌రైజర్స్ హైదరాబాద్:
డేవిడ్ వార్నర్ (సి), జానీ బెయిర్‌స్టో, మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్, సాహా, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, సందీప్ శర్మ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.