SRH vs DC: టాస్ గెలిచిన సన్‌రైజర్స్.. బ్యాటింగ్ ఎంచుకున్న కేన్ మామ.. తుది జట్టులో డేవిడ్ వార్నర్

డిల్లీ క్యాపిటల్స్‌ జట్టుపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ (PC: IPL)

IPL 2021: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత తొలి సారిగా డేవిడ్ వార్నర్ ఎస్‌ఆర్‌హెచ్ తరపున మ్యాచ్ ఆడుతున్నాడు.

  • Share this:
    ఐపీఎల్ 2021లో (IPL 2021) భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) - ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) మధ్య మ్యాచ్ జరుగుతున్నది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ (Kane Williamson) బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో కేవలం ఓకే మ్యాచ్ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నది. తొలి విడత మ్యాచ్‌లలో కెప్టెన్సీ మాత్రమే తుది జట్టులో స్థానం కోల్పోయిన డేవిడ్ వార్నర్ (David Warner) తిరిగి జట్టులోకి వచ్చాడు. నటరాజన్ (Natarajan) కోవిడ్ బారిన పడటం.. ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ ఐసోలేషన్‌కు వెళ్లడంతో జట్టుపై ఒత్తిడి నెలకొన్నది. జానీ బెయిర్‌స్టో గైర్హాజరీలో వృద్దిమాన్ సాహ కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నాను. విదేశీ ప్లేయర్ల కోటాలో కేన్, వార్నర్‌‌తో పాటు రషీద్ ఖాన్, జేసన్ హోల్డర్ తుది జట్టులోకి వచ్చారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రతీ మ్యాచ్ గెలిస్తే తప్ప ప్లేఆఫ్స్‌కు అవకాశాలు ఉండవు.

    ఇక ఈ సీజన్‌లో అంచనాలను అందుకుంటూ రాణిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు రిషబ్ పంత్ కెప్టెన్‌గా కంటిన్యూ అవుతున్నాడు. తొలి దశలో అందుబాటులో లేకుండా పోయిన శ్రేయస్ అయ్యర్ జట్టుతో చేరడంతో బ్యాటింగ్ బలం మరింత పెరిగింది. ధావన్, పృథ్విషా ఫామ్‌లో ఉన్నారు. ఇది జట్టుకు కలసి వచ్చే అంశం, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ వంటి స్పిన్నర్లు తుది జట్టులో ఉండటం దుబాయ్ పిచ్‌పై మంచి ప్రభావం చూపించగలరు. ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్స్ అవకాశాలు మరింత మెరుగు పరుచుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తున్నది.









    దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రషీద్ ఖాన్‌కు మంచి రికార్డు ఉన్నది. ఇక్కడ ఆడిన 12 టీ20 మ్యాచ్‌లలో 17 వికెట్లు తీసుకున్నాడు. గత మ్యాచ్‌లో ఉపయోగించిన వికెట్‌నే దీనికి కూడా ఉపయోగిస్తున్నారు. గత రెండు మ్యాచ్‌లలో పేసర్లకు 25, స్పిన్నర్లకు 2 వికెట్లు పడ్డాయి. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటంతో తొలుత బ్యాటింగ్‌కు అనుకూలించే అకాశం ఉన్నది.
    Published by:John Naveen Kora
    First published: