SRH vs DC: చేతులెత్తేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. విజృంభించిన ఢిల్లీ బౌలర్లు.. లక్ష్యం ఎంతంటే

ఢిల్లీ క్యాపిటల్స్ ముందు స్వల్ప లక్ష్యాన్ని ఉంచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (PC: IPL)

IPL 2021: ఐపీఎల్ 2021లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 134 పరుగులు చేసింది.

  • Share this:
    ఐపీఎల్ 2021 (IPL 2021) ప్లేఆఫ్స్ (Play Offs) చేరాలంటే తప్పకుండా మిగిలిన మ్యాచ్‌లన్నీ గెలవాల్సిన పరిస్థితుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisrs Hyderabad) జట్టు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో (Delhi Capitals) తలపడుతున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 134 పరుగులు మాత్రమే చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ ఎవరూ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. డేవిడ్ వార్నర్ (David Warner) మరోసారి విఫలం అవడం జట్టుకు భారంగా మారింది. ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్లు విఫలమయ్యారు. డేవిడ్ వార్నర్ (0) తొలి ఓవర్‌లోనే అవుటయ్యాడు. వరుస బౌండరీలు కొడుతున్న వృద్దిమాన్ సాహ (18) షార్ట్ పుట్ బంతికి అవుటయ్యాడు. ఆ తర్వాత కేన్ విలియమ్‌సన్ (18), మనీశ్ పాండ్ (17) క్రీజులో కుదురుకున్నట్లు కనిపించినా.. స్వల్ప వ్యవధిలో వారిద్దరూ అవుటయ్యారు. కేదార్ జాదవ్ (5) కూడా నిరాశ పరిచాడు. దీంతో హైదరాబాద్ జట్టు 61 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయింది.

    అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్ కలసి కాస్త దూకుడుగా ఆడారు. వీరిద్దరూ విలువైన పరుగులు జోడించారు. అయితే జాసన్ హోల్డర్ (10) త్వరగా అవుటవడంతో హైదరాబాద్ జట్టు కసీసం 110 పరుగులు జోడిస్తుందా అని ఫ్యాన్స్ ఆందోళనలో పడ్డారు. అయితే అబ్దుల్ సమద్ (28), రషీద్ ఖాన్ (22) వేగంగా పరగులు చేయడంతో హైదరాబాద్ జట్టు స్కోర్ పెరిగింది. అయితే చివర్లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేసి వికెట్లు తీయడమే కాకుండా పరుగులు రాకుండా కట్టడి చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. కగిసో రాబాడ 3 వికెట్లు తీయగా, ఎన్రిక్ నోకియా, అక్షర్ పటేల్‌కు చెరి రెండు వికెట్లు దక్కాయి.





    గతంలో హైదరాబాద్ జట్టు లో స్కోరింగ్‌ మ్యాచ్‌లను గెలిచిన సందర్భాలు ఉన్నాయి. పవర్ ప్లేలో కనుక వికెట్లు తీయగలిగితే మ్యాచ్ ఆసక్తికరంగా మారుతుంది. ఈ మ్యాచ్ ఓడిపోతే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్లేఆఫ్స్‌కు వెళ్లే అవకాశాలు క్లిష్టంగా మారుతాయి.
    Published by:John Naveen Kora
    First published: