SRH vs DC: హైదరాబాద్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఆల్‌రౌండ్‌ షోతో మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్న క్యాపిటల్స్

సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం (PC: IPL)

ఐపీఎల్ 2021లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పరాజయాల పరంపర కొనసాగుతున్నది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోవడంతో ప్లేఆఫ్ అవకాశాలను దాదాపు మూసుకునే పరిస్థితికి చేరుకున్నది.

  • Share this:
    ఐపీఎల్ 2021 (IPL 2021) సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) పరాజయాల పరంపర కొనసాగుతున్నది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో (Delhi Capitals) జరిగిన మ్యాచ్‌లో  బ్యాటింగ్‌లో విఫలం అయిన హైదరాబాద్ జట్టు బౌలింగ్‌లో కూడా చేతులెత్తేసింది. ఏ దశలోనూ ఢిల్లీ  బ్యాట్స్‌మెన్‌ను నిలువరించ లేక స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. మొత్తానికి ఆల్‌రౌండ్ షో చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి తిరిగి పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానానికి చేరుకున్నది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇచ్చిన 135 పరుగల టార్గెట్‌ను ఛేదించడానికి బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్లు సరైన ఆరంభం అందించలేక పోయారు. ఓపెనర్ పృథ్వీషా (11) ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో కేన్ విలియమ్‌సన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇక ఆ తర్వాత శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్ కలసి హైదరాబాద్ బౌలర్లను బెంబేలెత్తించారు. ముందు శిఖర్ ధావన్ ఎక్కువగా స్ట్రైక్ తీసుకొని తన సహజ శైలిలో షాట్లు బాదాడు.

    గాయం నుంచి కోలుకుని వచ్చిన శ్రేయస్ అయ్యర్ కూడా తానేమీ తక్కువ కాదన్నట్లు షాట్లు కొట్టాడు. వీరిద్దరూ కలసి రెండో వికెట్‌కు 52 పరుగులు జోడించారు. శిఖర్ ధావన్ (42) రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అబ్దుల్ సమద్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత శ్రేయస్అయ్యర్‌కు జత కలిసిన కెప్టెన్ రిషబ్ పంత్ చెలరేగి పోయాడు. మరో వికెట్ పడకుండా వీరిద్దరూ కలసి స్వల్ప లక్ష్యాన్ని కేవలం 17.5 ఓవర్లలో ఛేదించారు. స్వల్ప లక్ష్యాలను కాపాడుకోవడంలో సన్‌రైజర్స్ బౌలర్లకు మంచి రికార్డు ఉన్నది. కానీ ఈ సారి మాత్రం చాలా నిర్లక్ష్యంగా బంతులు విసిరారు. చివర్లో వైడ్లు వేయడమే కాకుండా సిక్సులు, ఫోర్లు ఇచ్చి లక్ష్య ఛేదనను ఈజీ చేసేశారు.

    Cricket Law: క్రికెట్ నుంచి 'బ్యాట్స్‌మాన్' అనే పదం తొలగింపు.. సంచలన నిర్ణయం తీసుకున్న ఎంసీసీ


     






    ఈ సీజన్‌లో మొత్తం 8 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏకంగా 7 మ్యాచ్‌లు ఓడిపోయింది. ఇంకా 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నది. కానీ ఆ మ్యాచ్‌లు అన్నీ గెలిచినా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లేఆఫ్స్ చేరుకునే అవకాశాలు దాదాపు లేవనే అనుకోవచ్చు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకున్నది.
    Published by:John Naveen Kora
    First published: