Hyderabad vs Delhi: ఢిల్లీ క్యాపిటల్స్‌,ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్ టై.. సూపర్ ఓవర్లో ఢిల్లీ విజయం!

Delhi captial vs SRH

చెన్నై వేదికగా ఎస్‌ఆర్‌హెచ్‌తో జరుగుతున్న మ్యాచ్‌ టై అయింది. సూపర్ ఓవర్‌లో ఢిల్లీ విజయం సాధించింది.

  • Share this:
    చెన్నై వేదికగా ఎస్‌ఆర్‌హెచ్‌,ఢిల్లీ మధ్య జరుగిన మ్యాచ్‌ టై అయింది. సూపర్ ఓవర్‌లో ఢిల్లీ విజయం సాధించింది.

    సూపర్ ఓవర్ సాగిందిలా...

    సన్‌రైజర్స్ సూపర్ ఓవర్ : 7 పరుగులు
    ఎస్‌హెఆచ్ బ్యాట్స్‌మెన్స్: విలియ్సమన్‌,వార్నర్
    మెుదటి బంతి: పరుగులు రాలేదు
    రెండో బంతి: ఒక పరుగు
    మూడో బంతి: నాలుగు పరుగులు
    నాలుగో బంతి: పరుగులు రాలేదు
    ఐదో బంతి: ఒక పరుగు
    ఆరో బంతి: ఒక పరుగు

    ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ ఓవర్‌‌: 8
    డీసీ బ్యాట్స్‌మెన్స్: ధావన్,పంత్
    మెుదటి బంతి: ఒక పరుగు
    రెండో బంతి: ఒక పరుగు
    మూడో బంతి: నాలుగు పరుగులు
    నాలుగో బంతి: పరుగు రాలేదు
    ఐదో బంతి: ఒక పరుగు
    ఆరో బంతి: ఒక పరుగు

    అంతకుముందు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసిన ఢిల్లీ... ఎస్‌ఆర్‌హెచ్ ముందు 160 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌కు అదిలోనే షాక్ తగిలింది.

    అశ్విన్‌ వేసిన 4 ఓవర్‌లో డేవిడ్‌ వార్నర్‌(6) ఔటయ్యాడు. బెయిర్‌స్టో ఆడిన షాట్‌కు అనవసర పరుగుకు యత్నించి రబడ చేతిలో రనౌటై పెవిలియన్‌ చేరాడు. దాంతో హైదరాబాద్‌ 28 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత బెయిర్‌స్టో(22) ఢిల్లీ బౌలర్లపై విరుచుపడ్డాడు. ఇలానే దాటిగా ఆడే క్రమంలో అవేశ్‌ ఖాన్‌ ఓవర్‌లో సిక్స్ బాదిన బెయిర్‌స్టో(38) తర్వాత బంతికి ధావన్‌ చేతికి చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్ సింగ్‌తో విలయమ్సన్ ఇన్నింగ్స్‌న్ ముందుకు తీసుకెళ్ళాడు. ఆడదడపా విలియమ్సన్‌ ఫోర్లు సాధిస్తున్న విరాట్ స్లో బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో భారీ ఆడబోయి అవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో స్టోయినిస్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన కేదార్ జాదవ్(9) కూడా ఆకట్టుకోలేకపోయాడు. అమిత్ మిశ్రా బౌలింగ్‌లో స్టంప్ ఔటయ్యాడు. ఈ క్రమంలో  విలయమ్సన్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇక రన్ రేటు పెరిగిపోవడంతో ఎప్పటిలాగే వేగంగా ఆడే క్రమంలో సన్‌రైజర్స్ ఓత్తిడి గురై వికెట్లు పారేసుకున్నారు.  చివరి  ఓవర్లో 16 పరుగులు కావాల్సి ఉండగా ఎస్‌ఆర్‌హెచ్ 15 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. మెుదటి మ్యాచ్ ఆడుతున్న సుచిత్ . ఓ సిక్స్ రెండు పోర్లు కొట్టి ఆదరగొట్టాడు.
    Published by:Rekulapally Saichand
    First published: