Home /News /sports /

IPL 2021 : సన్‌రైజర్స్ హైదరాబాద్ సెలెబ్రేషన్స్.. మ్యాచ్‌లు ఓడిపోతూ ఆ సంబరాలేంటంటూ ఫ్యాన్స్ ఫైర్

IPL 2021 : సన్‌రైజర్స్ హైదరాబాద్ సెలెబ్రేషన్స్.. మ్యాచ్‌లు ఓడిపోతూ ఆ సంబరాలేంటంటూ ఫ్యాన్స్ ఫైర్

ఇండోర్ గేమ్స్ ఆడుకున్న సన్‌రైజర్స్ క్రికెటర్స్

ఇండోర్ గేమ్స్ ఆడుకున్న సన్‌రైజర్స్ క్రికెటర్స్

    ఐపీఎల్ 2021లో (IPL 2021) సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు వరుసగా మ్యాచ్‌లు ఓడిపోతూ పాయింట్ల పట్టికలో (Points Table) అట్టడుగున నిలిచింది. ఒకటి రెండు మ్యాచ్‌లు ఓడిపోతే.. దురదృష్టం అనుకొని ఫ్యాన్స్ సర్దిచెప్పుకున్నారు. కానీ రోజురోజుకూ పేలవమైన ఆటతీరుతో ఓడిపోవడానికే ఆడుతున్నట్లు ఉండటంతో ఫ్యాన్స్ గరంగరం అవుతున్నరు. గత ఐదు సీజన్లలో వరుసగా ప్లేఆఫ్స్‌కు వెళ్లిన రికార్డు ఉన్న సన్‌రైజర్స్ ఈ సారి అంచనాలను అందుకోలేక పోతున్నది. ప్లేఆఫ్స్ ఆశలను ఫ్యాన్స్ కూడా వదిలేశారు. కనీసం మా కోసం ఒకటి రెండు మ్యాచ్‌ లైనా గెలవాలని కోరుకుంటున్నారు. ఇక చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయం తర్వాత టీమ్ గెట్ టుగెదర్ నిర్వహించింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీన్ని చూసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ జట్టును తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ముందు మ్యాచ్ గెలిచి ఆ తర్వాత సంబరాలు చేసుకోండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    సన్‌రైజర్స్ ఆటగాళ్లు టీమ్ బాండింగ్ పేరుతో ఒక చిన్ని గెట్‌టుగెదర్ నిర్వహించింది. ఇందులో జట్టులోని ఆటగాళ్లంతా చిన్న పిల్లల్లాగ ఇండోర్ గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేశారు. బెలూన్స్ ఎగరేయడం, ట్రైన్ ఆట, హైడ్ అండ్ సీక్ ఆడుతూ ఉల్లాసంగా గడిపారు. ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. మేమంతా ఓటమి బాధలో ఉంటే మీరు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారా? అంటూ తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారు. అసలు ఆట ఆడకుండా ఈ పిల్లాటలు ఏంటని నిలదీస్తున్నారు. ఇలా ట్రైన్ ఆట ఆడుకుంటూ ఇంటికి వెళ్లిపోండి అని మరొకరు కామెంట్ చేశారు.





    కాగా, ఐపీఎల్ 2021లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆరు మ్యాచ్‌లు ఆడి ఐదింటిలో ఓడిపోయింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. చాలా మ్యాచ్‌లు చివరి ఓవర్ వరకు వచ్చి ఓటములుగా మారాయి. జట్టులో సరైన ఫినిషర్ లేకపోవడంతో ఓటములు తప్పడం లేదు. మరోవైపు ఈ సీజన్‌లో కెప్టెన్ డేవిడ్ వార్నర్ అంచనాలకు తగ్గట్లు ఆడటం లేదు. ఆటగాడిగానే కాకుండా కెప్టెన్‌గా కూడా విమర్శలు ఎదుర్కుంటున్నాడు. అతడి స్థానంలో కేన్ విలియమ్‌సన్‌ను కెప్టెన్ చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. మనీష్ పాండే సమయానికి తగ్గట్లు ఆడటం లేదు. మరోవైపు కీలక బౌలర్లు భువనేశ్వర్ కుమార్ గాయపడటం, టి. నటరాజన్ ఈ సీజన్ మొత్తానికి దూరం కావడం జట్టుకు పెద్ద నష్టాన్ని కలిగిస్తున్నది. రషీద్ ఖాన్ వికెట్లు తీస్తున్నా.. అతడికి తోడుగా వికెట్లు తీసే మరో బౌలర్ లేకపోవడంతో భారం పడుతున్నది. విజయ్ శంకర్ పేరుకే ఆల్‌రౌండర్.. కానీ అటు బ్యాటుతో బంతితో విఫలం అవుతున్నాడు. సన్‌రైజర్స్ ఎంత త్వరగా విజయాల బాట పడితే అంత మంచిదని విశ్లేషకులు చెబుతున్నారు.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: David Warner, IPL 2021, Kane Williamson, Sunrisers Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు