IPL 2021: హోటల్ గదిలోనే డేవిడ్ వార్నర్.. గ్రౌండ్‌కు ఎందుకు రాలేదని ఫ్యాన్స్ అయోమయం.. క్లారిటీ ఇచ్చిన కోచ్

డేవిడ్ వార్నర్ గ్రౌండ్‌కు ఎందుకు రాలేదు? క్లారిటీ ఇచ్చిన కోచ్ (PC: IPL)

IPL 2021: రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్‌కు తుది జట్టులో కనపడలేదు. అయితే అతడు మైదానానికి కూడా రాకుండా హోటల్ రూమ్‌లోనే ఉండిపోయాడు. దీనిపై కోచ్ ట్రెవర్ బేలిస్ క్లారిటీ ఇచ్చాడు.

  • Share this:
    ఐపీఎల్ 2021లో (IPL 2021) సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఎట్టకేలకు సోమవారం రాజస్థాన్ రాయల్స్‌పై (Rajasthan Royals) గెలిచి రెండో విజయాన్ని నమోదు చేసింది. తుది జట్టులో భారీ మార్పులు చేయడంతో సీనియర్లకు చోటు లభించలేదు. డేవిడ్ వార్నర్ (David Warner), మనీశ్ పాండే, కేదార్ జాదవ్‌లకు తుది జట్టులో చోటు లభించలేదు. అయితే అంది వచ్చిన అవకాశాన్ని కొత్త ఆటగాళ్లు వినియోగించుకున్నారు. జేసన్ రాయ్ (60) Jason roy) అరంగేట్రం మ్యాచ్‌లోనే ధాటిగా ఆడి సన్‌రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే మ్యాచ్ జరిగే సమయంలో డగౌట్‌లో చూస్తే డేవిడ్ వార్నర్ కనిపించలేదు. సాధారణంగా తుది జట్టులో స్థానం దొరకని ఆటగాళ్లు డగౌట్‌లో కూర్చుంటారు. కానీ డేవిడ్ వార్నర్ సహా.. కేదార్ జాదవ్, మనీశ్ పాండే కూడా అక్కడ కనిపించకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు.

    డేవిడ్ వార్నర్ కనిపించకపోవడంపై మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ ట్రెవర్ బేలిస్ క్లారిటీ ఇచ్చాడు. సన్‌రైజర్స్ టీమ్‌లో చాలా మంది యువ క్రికెటర్లు ఉన్నారు. కరోనా నిబంధనల వల్ల వాళ్లందరూ డగౌట్‌కు రావడం లేదు. అందుకే ఆ జూనియర్లకు కొంత మంది సీనియర్లను తోడుగా హోటల్‌లోనే ఉంచుతున్నాము. ప్రతీ మ్యాచ్‌కు ఒకరిద్దరు సీనియర్లు హోటల్ రూమ్స్‌లో జూనియర్లతో కూర్చొని టీవీ చూస్తున్నారు. అలా చేయడం వల్ల యువ క్రికెటర్లకు కాస్త మానసిక స్థైర్యం ఉంటుంది. మాకు అవకాశాలు రాకపోవడమే కాకుండా ఇక్కడే వదిలేసి వెళ్లారని వాళ్లు ఆందోళన చెందే అవకాశం ఉన్నది. అందుకే యువ క్రికెటర్లకు తోడుగా డేవిడ్ వార్నర్ అక్కడే ఉండిపోయాడు అని ట్రెవర్ బేలిస్ చెప్పుకొచ్చాడు.

    Ganguly Fined: సౌరవ్ గంగూలీకి కోల్‌కతా హైకోర్టు జరిమానా... అసలు కారణం ఇదే







    మరోవైపు ఐపీఎల్ 2021లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడబోయే మిగిలిన మ్యాచ్‌లకు కూడా డేవిడ్ వార్నర్‌కు అవకాశం లభించే అవకాశం లేదని తెలుస్తున్నది. ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న వార్నర్‌ను ఇక సన్‌రైజర్స్ ఆడే మ్యాచ్‌లలో చూడటం కష్టమే అని తెలుస్తున్నది. వచ్చే సీజన్‌కు కూడా వార్నర్‌కు అవకాశం లభించే అవకాశం లేదు. ఎస్ఆర్‌హెచ్ రాబోయే సీజన్‌కు వార్నర్‌ను తీసుకోబోవడం లేదని ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. రాబోయే మెగా వేలంలో కూడా అతడిని కొనుగోలు చేయబోవడం లేదని సమాచారం. ఈ సారి సన్‌రైజర్స్ జట్టు పూర్తిగా కొత్త వారితో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. అందుకోసం ఇప్పటి నుంచే సన్నాహలు చేస్తున్నారు. సీఈవో కావ్యా మారన్ సహా కోచ్, మెంటార్‌లతో ఈ విషయం చర్చించినట్లు సమాచారం.
    Published by:John Naveen Kora
    First published: