సర్‌రైజర్స్ హైదరాబాద్‌కు కొత్త కెప్టెన్ వచ్చేశాడు. 2023 ఐపీఎల్‌లో తమ కెప్టెన్ ఎవరో ఎస్‌ఆర్‌హచ్ ఫ్రాంచైజీ తన ట్విట్టర్ హ్యాండిల్లో ప్రకటించింది. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ మార్‌క్రమ్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. టీమ్‌ఇండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్, పేసర్, సీనియర్ భువనేశ్వర్ కుమార్‌ను పక్కకు నెట్టి మరీ మార్‌క్రమ్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది సన్‌రైజర్స్ యాజమాన్యం. ఇటివల సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి చెందిన సన్‌రైజర్స్ ఈస్టర్ క్యాప్ జట్టును నడిపించిన మార్‌క్రమ్ విజేతగా నిలబెట్టాడు. సూపర్ ప్రదర్శనతో ఆకట్టుకొని జట్టుకు టైటిల్ అందించిన ఎయిడెన్ మార్‌క్రమ్ సన్‌రైజర్స్ యాజమాన్యం ప్రమోషన్ ఇచ్చింది. సౌతాఫ్రికా లీగ్‌లో కెప్టెన్‌గా, ఆటగాడిగా రాణించిన మార్‌క్రమ్‌ను.. ఐపీఎల్‌లో కూడా కెప్టెన్‌గా కొనసాగించాలని నిర్ణయించుకుంది.
కెప్టెన్‌గా మార్‌క్రమ్‌కు మంచి రికార్డులు:
నిజానికి మార్‌క్రమ్‌కు SRH కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తుందని ముందుగానే చాలా మంది భావించారు. కెప్టెన్‌గా మార్‌క్రమ్‌కు మంచి రికార్డులే ఉన్నాయి. దక్షిణాఫ్రికా టీ20 లీగ్ గెలుపుతో పాటు 2014లో దక్షిణాఫ్రికాకు అండర్-19 వరల్డ్ కప్ అందించారు మార్‌క్రామ్. ఇక మార్‌క్రమ్ ఆల్‌రౌండర్ కావడం.. ఇటివల అతని ప్రదర్శన అద్భుతంగా ఉండడంతో మార్‌క్రమే బెస్ట్ ఆప్షన్‌గా కనిపించాడు. దక్షిణాఫ్రికా లీగ్‌లో 366 పరుగులతో పాటు 11 వికెట్లతో మ్యాన్ ఆఫ్ ద టోర్నీ అవార్డు కూడా అందుకున్నాడు మార్‌క్రమ్. సెమీస్‌లో మార్క్‌రమ్ సెంచరీతో చెలరేగి జట్టును ఫైనల్ చేర్చాడు. అక్కడ తన కెప్టెన్సీ ప్రతిభతో జట్టును గెలిపించాడు
THE. WAIT. IS. OVER. ⏳#OrangeArmy, say hello to our new captain Aiden Markram ????#AidenMarkram #SRHCaptain #IPL2023 | @AidzMarkram pic.twitter.com/3kQelkd8CP
— SunRisers Hyderabad (@SunRisers) February 23, 2023
మయాంక్ అగర్వాల్, భూవికి నో ఛాన్స్:
నిజానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పోస్ట్‌కు మార్‌క్రమ్, మయాంక్ అగర్వాల్ మధ్య గట్టి పోటి నెలకొంది. అటు అత్యంత సీనియర్ అయిన భువనేశ్వర్ కుమార్‌కు కెప్టెన్సీ ఇవ్వాలని ఉన్నా అతని వయసు, ఫిట్‌నెస్ సమస్యలు ప్రతికూలంగా మారాయి. దీంతో కేవలం అగర్వాల్, మార్‌క్రమ్ మధ్య ఫైనల్ ఫైట్ నిలిచింది. గత సీజన్‌లో జట్టును నడిపించిన కేన్ విలియమ్సన్‌పై వేటు వేసిన సన్‌రైజర్స్.. మినీ వేలంలో హరీ బ్రూక్, మయాంక్ అగర్వాల్‌లకు భారీ మొత్తంలో చెల్లించి జట్టులోకి తీసుకుంది. ఇక అగర్వాల్‌కు కెప్టెన్సీ ఇస్తారనుకున్నారంతా. అయితే అగర్వాల్‌కు పంజాబ్ కెప్టెన్సీ చేసిన అనుభవమున్నా.. అతను కెప్టెన్‌గా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. దీంతో మార్‌క్రమ్ తప్ప మరో బెస్ట్ ఆప్షన్ లేకుండాపోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IPL 2023, SRH, Sun risers hyderabad