Home /News /sports /

SRH APPOINT BRIAN LARA AS BATTING COACH SIMON KATICH AS ASSISTANT COACH JNK

IPL 2022: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి బ్రియన్ లారా, సైమన్ కటిచ్.. ఎవరు ఏ బాధ్యతలు చేపట్టారో చూడండి..

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కోచింగ్ స్టాప్‌లోకి బ్రియన్ లారా, సైమన్ కటిచ్ (PC: SRH)

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కోచింగ్ స్టాప్‌లోకి బ్రియన్ లారా, సైమన్ కటిచ్ (PC: SRH)

IPL 2022: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సపోర్టింగ్ స్టాఫ్‌లో దిగ్గజ క్రికెటర్లు జాయిన్ అయ్యారు. బ్రియన్ లారా ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ కోచ్‌గా, సైమన్ కటిచ్ అసిస్టెంట్ కోచ్‌గా నియమించుకున్నారు. ఇప్పటికే డేల్ స్టెయిన్ బౌలింగ్‌ కోచ్‌గా నియమించారు.

ఇంకా చదవండి ...
    ఐపీఎల్ 2022 (IPL 2022) కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) పూర్తిగా సన్నద్దం అవుతున్నది. జట్టు కోచింగ్ స్టాఫ్‌ను (Coaching Staff) మార్చివేయడమే కాకుండా అనుభవజ్ఞులైన మాజీ క్రికెటర్లను నియమించుకుంటున్నది. దిగ్గజ బ్యాటర్ బ్రియాన్ లారా (Brian Lara), దక్షిణాఫ్రికా డెడ్లీ బౌలర్ డేల్ స్టెయిన్ (Dale Steyn), సైమన్ కటిచ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చేరారు. లారాను బ్యాటింగ్ కోచ్‌గా, స్టెయిన్‌ను బౌలింగ్ కోచ్‌గా, సైమన్ కటిచ్‌ను అసిస్టెంట్ కోచ్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్ నియమించింది. హైదరాబాద్ జట్టు ప్రధాన కోచ్‌గా టామ్ మూడీ తిరిగి బాధ్యతలు చేపట్టున్నారు. టెస్టు క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా లారాను కేవలం బ్యాటింగ్ కోచ్‌గా మాత్రమే కాకుండా ఫ్రాంచైజీ వ్యూహాత్మక సలహాదారుగా కూడా నియమించింది. ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ సైమన్ కటిచ్ అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. భారత మాజీ క్రికెటర్ హేమంగ్ బదానీ ఫీల్డింగ్ కోచ్ మరియు స్కౌట్‌గా ద్విపాత్రాభినయం చేయనున్నాడు. ముత్తయ్య మురళీధరన్ వంటి లెజెండ్ ఇప్పటికే ఈ ఫ్రాంచైజీతో అనుబంధం కలిగి ఉన్నాడు. మురళీధరన్ స్పిన్ బౌలింగ్ కోచ్ బాధ్యతలను చేపట్టడమే కాకుండా జట్టు కోసం వ్యూహాలు రచించాడు.

    బ్రియాన్ లారా వెస్టిండీస్ తరఫున 133 టెస్టులు, 299 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 34 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలతో 11953 పరుగులు చేశాడు. దీంతో పాటు వన్డేల్లో 19 సెంచరీల సాయంతో 10405 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతని పేరిట 53 సెంచరీలు, 22358 పరుగులు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో లారా ఒక ఇన్నింగ్స్‌లో 401 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్‌లో 9 డబుల్ సెంచరీలు సాధించాడు. ఇందులో రెండు ట్రిపుల్ సెంచరీలు ఉన్నాయి. లారా 1994లో ఇంగ్లండ్‌పై 375, 2004లో 400 పరుగులు చేశాడు.

    INd vs SA: మాజీ కోచ్ రవిశాస్త్రి న్యూ లుక్ చూశారా? దక్షిణాఫ్రికా పర్యటనలో కొత్త అవతారంలో రవిశాస్త్రి







    అదే సమయంలో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ అంతర్జాతీయ క్రికెట్‌లో 699 వికెట్లు పడగొట్టాడు. ఈ వెటరన్ ప్లేయర్ 93 టెస్టుల్లో 435 వికెట్లు, 125 వన్డేల్లో 196 వికెట్లు, 43 టీ20ల్లో 64 వికెట్లు తీశాడు. దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన ఆటగాడిగా స్టెయిన్ రికార్డు సృష్టించాడు. స్టెయిన్ 2343 రోజుల పాటు నంబర్ 1 టెస్ట్ బౌలర్‌గా కొనసాగాడు. ఇది ప్రపంచ రికార్డు.

    Ajaj Patel: చారిత్రాత్మక బౌలింగ్ తర్వాత కూడా జట్టులో స్థానం కోల్పోయిన అజాజ్ పటేల్.. ఇతనిలాంటి దురదృష్టవంతులు ఇంకా ఎవరున్నారంటే..




    ఐపీఎల్ 2021లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యంత చెత్త ప్రదర్శన చేసి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఆ జట్టు 14 మ్యాచ్‌ల్లో మూడింటిలో విజయం సాధించగా 11 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇంతలో డేవిడ్ వార్నర్ నుంచి కెప్టెన్సీని తీసేసి కేన్ విలియమ్సన్‌కి అప్పగించినా అద్భుతాలు చేయలేకపోయాడు. దీంతో పాటు హైదరాబాద్ తరఫున అత్యధిక పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కూడా జట్టు నుంచి విడిపోయారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:John Kora
    First published:

    Tags: IPL 2022, Sunrisers Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు