SREESANTH RETURN WITH AGRESSION AND SLEDGE BATSMAN DURING WARM UP MATCH SRD
Sreesanth : ఏమయ్యా శ్రీశాంత్.. ఇంత జరిగినా నువ్వు మారవా..? ఎనిమిదేళ్ల తర్వాత కూడా..
Sreesanth (Photo credit : Twitter)
Sreesanth : టీమిండియా మాజీ క్రికెటర్, కేరళ స్పీడ్ స్టార్ క్రికెటర్.. కేరళ స్పీడ్ స్టార్ శ్రీశాంత్ 8 ఏళ్ల తర్వాత మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే, ఎనిమిదేళ్ల తర్వాత శ్రీశాంత్ అదే కోపాన్ని ప్రదర్శించడం ఇప్పుడు వైరల్ గా మారింది.
టీమిండియా మాజీ క్రికెటర్, కేరళ స్పీడ్ స్టార్ క్రికెటర్.. కేరళ స్పీడ్ స్టార్ శ్రీశాంత్ 8 ఏళ్ల తర్వాత మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవలే కేరళ జట్టు ప్రాబబుల్స్ లో శ్రీశాంత్ చోటు దక్కించుకున్నాడు. జనవరి 10 నుంచి సయ్యద్ ముస్తాక్ టోర్నీ జరగనుంది. అందుకోసం కేరళ జట్టు ప్రాక్టీస్ ను మొదలుపెట్టింది. అయితే, ఎనిమిదేళ్ల తర్వాత శ్రీశాంత్ అదే కోపాన్ని ప్రదర్శించడం ఇప్పుడు వైరల్ గా మారింది. కెరీర్ స్టార్టింగ్ నుంచే అగ్రెసివ్ క్రికెటర్ గా పేరు పొందిన శ్రీశాంత్ కు బాధ వేసినా.. సంతోషం కలిగినా అస్సలు ఆగలేడు. ఎదుటి వారిని బోల్తా కొట్టించేందుకు తనదైన శైలిలో స్లెడ్జింగ్ కు దిగుతాడు ఈ స్పీడ్ స్టార్. అతని కెరీర్ లో ఇలాంటివి ఎన్నో చూశాం. లేటెస్ట్ గా శ్రీశాంత్ సయ్యద్ ముస్తాక్ టోర్నీ ప్రాక్టీస్ మ్యాచ్ ల్లో ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ లో శ్రీశాంత్ వేసిన బంతిని ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ భారీ షాట్ ఆడాడు. ఆ షాట్‌ను కోపంతో చూస్తూ శ్రీశాంత్ మళ్లీ పాతరోజులకు వెళ్లిపోయాడు. పిచ్‌పై నిలబడి బ్యాట్స్‌మన్‌పై స్లెడ్జింజ్‌కు దిగాడు. అయితే, శ్రీశాంత్ బౌలింగ్ వీడియోనూ కేరళ క్రికెట్ అసోసియేషన్ యూట్యూబ్‌లో షేర్ చేసింది.
శ్రీశాంత్ స్లెడ్జింగ్ పై నెటిజన్లు తమదైశ శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 8 ఏళ్ల తర్వాత కూడా శ్రీశాంత్ తీరులో ఏ మార్పు లేదు. శ్రీశాంత్ అంటేనే కోపానికి మారుపేరు.. అతను అలా ఉంటేనే కరెక్ట్.. అని పేర్కొన్నారు.అయితే, 2013 ఐపీఎల్ సీజన్లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో బీసీసీఐ శ్రీశాంత్‌తో పాటు అంకిత్ చవాన్, అజిత్ చండీలాపై జీవితకాలం నిషేధం విధించింది.
అయితే బీసీసీఐ శ్రీశాంత్‌పై విధించిన నిషేధాన్ని ఏడేళ్లకి కుదించగా.. గతేడాది సెప్టెంబరుతో అది ముగిసింది. కేరళ టీమ్ కి టీమిండియా యంగ్ క్రికెటర్ సంజూ శామ్సన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.