చెన్నై సూపర్ కింగ్స్ అంటే అందుకే అసహ్యం.. క్రికెటర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు..

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అంటే తనకు అసహ్యమని.. దానికి ఓ బలమైన కారణం ఉందని క్రికెటర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 30, 2019, 1:23 PM IST
చెన్నై సూపర్ కింగ్స్ అంటే అందుకే అసహ్యం.. క్రికెటర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు..
శ్రీశాంత్ (Image: cricket next)
  • Share this:
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అంటే తనకు అసహ్యమని.. దానికి ఓ బలమైన కారణం ఉందని క్రికెటర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వాస్తవానికి మహేంద్ర సింగ్ ధోని, శ్రీనివాసన్ వల్లే తాను ఆ జట్టుపై కోపంతో ఉన్నానని అందరూ అనుకుంటారని, కానీ తనకు పసుపు రంగు అంటే అస్సలు నచ్చదని.. అందుకే ఆ జట్టు అంటే కోపం అని వెల్లడించాడు. అదే రంగు జెర్సీ వేసుకునే ఆస్ట్రేలియా జట్టును కూడా అసహ్యించుకుంటానని వివరించాడు. ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న శ్రీశాంత్.. రాజస్థాన్ కోచ్ పాడీ ఆప్టన్ తన ఆటోబయాగ్రఫీలో అతడిపై చేసిన ఆరోపణలకు వివరణ ఇచ్చాడు. చెన్నై జట్టుపై శ్రీశాంత్‌ను ఆడించకపోవడం వల్ల తనను దూషించడని ఆప్టన్ పేర్కొనగా.. ‘మిస్టర్ ఆప్టన్ మీ గుండె, పిల్లలపై చేయి వేసుకొని చెప్పండి. మిమ్మల్నెప్పుడైనా దూషించానా? నేను ఎంతగానో అభిమానించే రాహుల్ ద్రవిడ్‌ను కూడా ఈ సందర్భంగా ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నా.. నేను ఎప్పుడైనా ఆప్టన్‌తో గొడవ పడ్డానా?దూషించానా?’ అని శ్రీశాంత్ ప్రశ్నించాడు.

చెన్నై జట్టుపై తాను ఆడతానని ఆప్టన్‌ను తాను చాలా సార్లు కోరానని, ఎందుకంటే ఆ జట్టుపై తనకు మంచి రికార్డు ఉందని తెలిపాడు. ఆప్టన్‌ను తాను దూషించానన్న ఆరోపణలు మానసికంగా బాధించాయని.. పోలీసుల టార్చర్ కన్నా దుర్భరంగా అనిపించాయని వెల్లడించాడు.

First published: September 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు