ఆ మూడు జట్లకు ఐపీఎల్‌లో ఆడాలని ఉంది: శ్రీశాంత్‌

శ్రీశాంత్ (Image: cricket next)

  • Share this:
శ్రీశాంత్‌ తన మనుసులో మాట బయటపెట్టారు. క్రిక్‌ ట్రేకర్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సెషన్‌లో మాట్లాడిన శ్రీశాంత్‌ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌గా  తరుపున ఆడాలని ఉందన్నారు. గతంలో ముంబై ఇండియాన్స్ తరుపున ఆడిన సమయంలో సచిన్‌ టెండూల్కర్‌తో పాటు జట్టు యాజమాన్యం నుంచి తనకు మద్దతు లభించిందన్నారు. అలాగే రాయల్ ఛాలెంజర్స్, చైన్నై సూపర్ కింగ్స్‌కు ఆడాలని ఉందన్నారు.

ఐపీఎల్‌–2013లో స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడి ఏడేళ్ల పాటు నిషేదానికి గురైనా శ్రీశాంత్ సెప్టెంబర్‌లో శిక్ష కాలం ముగించుకోబోతున్నారు. త్వరలోనే కేరళ రంజీ జట్టు తరుపున పునరాగమనం చేయనున్నారు. అలాగే వచ్చే ఏడాది ఐపీఎల్‌తో పాటు వరల్డ్‌కప్‌ల్లో ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు శ్రీశాంత్‌. జాతీయ జట్టులోకి అడుగుపెట్టాలంటే ఐపీఎల్ మార్గం సుగమం చేసుకోవాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా వచ్చే ఏడాది ఐపీఎల‌్‌లో ఆడేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు.

ఇందులో భాగంగానే ఐపీఎల్‌లో ముంబై తరుపున ఆడేందుకు తొలి ప్రాధాన్యత ఇస్తానన్నారు. అలా కాకుండా ఏ జట్టు నుంచి అవకాశం వచ్చిన ఆడతనన్నారు. ఈ ఏడాది ఐపీఎల్ జరిగితే ఎక్కువ మంది విదేశీ ఆటగాళ్ళ అందుబాటులో ఉండకపోవచ్చునన్నారు శ్రీశాంత్‌. దీంతో స్వదేశీ  ఆటగాళ్ళు చాలా మందికి అవకాశం లభిస్తుందన్నారు.
First published: