SREESANTH EMOTIONAL TWEET COMEBACK SURESH RAINA WISHES FORMER INDIA TEAMMATE SA
Sreesanth: మళ్ళీ బంతి పట్టుకున్న శ్రీశాంత్ ... టీ20 టోర్ని ద్వారా రిఎంట్రీ
Sreesanth
కేరళ ఎక్స్‌ప్రెస్, టీమిండియా ఆటగాడు శ్రీశాంత్ మళ్లీ బంతి పట్టనున్నారు. ఏడేళ్ల నిషేధం తర్వాత క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీశాంత్‌కు మాజీ క్రికెటర్ సురేశ్ రైనా శుభాకాంక్షలు తెలిపాడు.
కేరళ ఎక్స్‌ప్రెస్, టీమిండియా ఆటగాడు శ్రీశాంత్ మళ్లీ బంతి పట్టనున్నారు. ఏడేళ్ల నిషేధం తర్వాత క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీశాంత్‌కు మాజీ క్రికెటర్ సురేశ్ రైనా శుభాకాంక్షలు తెలిపాడు. కేరళ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ప్రెసిడెంట్స్ కప్ టీ20 టోర్నమెంటులో శ్రీశాంత్ ఆడనున్నారు. ఏడేళ్ల తర్వాత మళ్ళీ క్రికెట్ ఆడుతున్నానని.. సంతోషాన్ని వ్యక్తం చేస్తూ శ్రీశాంత్ ట్విటర్ ద్వారా తన సంతోషాన్ని వ్యక్తంచేశాడు. " ఏడేళ్ల తర్వాత మళ్లీ బంతిని తిప్పే అవకాశం వచ్చింది. అమితంగా ఇష్టపడే క్రికెట్లో అత్యుత్తమంగా రాణించేందుకు ప్రయత్నం చేస్తున్నాను" అంటూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు.
శ్రీశాంత్ చేసిన ట్వీట్‌పై సురేశ్ రైనా స్పందించారు. ‘గుడ్ లక్ మై బ్రదర్’ అంటూ శ్రీశాంత్‌ను విషెస్ తెలియజేశాడు.
స్పాట్ ఫిక్సింగ్ కారణంగా శ్రీశాంత్‌పై బీసీసీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. 2013 ఐపీఎల్లో అతని ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరొపణలు వచ్చాయి. ఆ సమయంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరుపున ఆడుతున్న శ్రీశాంత్‌పై నిషేదం విధించారు. అతనితో పాటు అజిత్ చండేలా, అంకిత్ చవాన్‌లను కూడా బ్యాన్ చేశారు. ఈ ఘటనపై పలు సార్లు శ్రీశాంత్ ఆప్పీల్ చేసుకున్నప్పటికి ఎలాంటి
సానుకూలంగా ఫలితం లేకపోయింది. అతని విన్నపాన్ని పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ గత సంవత్సరం అతని నిషేదాన్ని ఏడేళ్లకు కుదించారు. సెప్టెంబరుతో ఆ బ్యాన్ ముగిసింది.
దీంతో మళ్ళీ బంతితో మయా చేయడానికి సిద్దమవుతున్నాడు. అందు కోసం ప్రెసిడెంట్స్ కప్ టీ 20 టోర్నీ వేదికగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వచ్చే నెల 17న ఈ టోర్ని మెుదలుకానున్నది. ఈ బిగ్ టోర్నిలో కేసీఏ రాయల్స్, కేసీఏ టైగర్స్, కేసీఏ టస్కర్స్, కేసీఏ ఈగల్స్, కేసీఏ పాంథర్స్, కేసీఏ లయన్స్ జట్లు పోటి పడనున్నాయి.
Published by:Rekulapally Saichand
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.