SPORTS VIRAL NEWS AMERICA BASEBALL STADIUM SELLING BURGER FOR WHOPPING RS 25 LAKH LEAVES FANS SHOCKED SJN
Sports Viral News: అమ్మ బాబోయ్... ఆ స్టేడియంలో బర్గర్ తినాలంటే మీ ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. సింగిల్ బర్గర్ విలువ ఎంతంటే?
రూ. 25 లక్షలు విలువ చేసే బర్గర్ (PC: TWITTER)
Sports Viral News: అవును... మీరు టైటిల్ లో చదవింది నిజమే.. ఆ స్టేడియంలో మీరు బర్గర్ తినాలంటే మాత్రం ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అంత రేటుతో అక్కడ బర్గర్ లను విక్రయిస్తున్నారు. భారత్ (India)లో క్రికెట్ కు ఎంత ఆదరణ ఉంటుందో... అమెరికా (USA)లో బేస్ బాల్ కు అంతే ఆదరణ ఉంటుంది.
Sports Viral News: అవును... మీరు టైటిల్ లో చదవింది నిజమే.. ఆ స్టేడియంలో మీరు బర్గర్ తినాలంటే మాత్రం ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అంత రేటుతో అక్కడ బర్గర్ లను విక్రయిస్తున్నారు. భారత్ (India)లో క్రికెట్ కు ఎంత ఆదరణ ఉంటుందో... అమెరికా (USA)లో బేస్ బాల్ కు అంతే ఆదరణ ఉంటుంది. అంతేకాకుండా బేస్ బాల్, క్రికెట్(Cricket) కు కొన్ని పోలికలు కూడా ఉంటాయి. అయితే అట్లాంటా రాష్ట్రంలోని జార్జియా సిటీలోని ఓ బేస్ బాల్ స్టేడియంలో బర్గర్ ధర తెలిస్తే మీ కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. అక్కడ ఒక బర్గర్ ను 33 వేల అమెరికన్ డాలర్లకు అమ్ముతున్నారు. మన కరెన్సీలో అయితే దాని విలువ దాదాపుగా 25 లక్షలకు. షాక్ తిన్నారా? తినే ఉంటారు. ఆ బర్గర్ కంటే కూడా షాక్ తినడమే మంచిది లెండి. ఈ రేటు తమకు కాస్త ఎక్కువ అనుకుంటే మరో బర్గర్ ను కాస్త తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. దాని ధర 151 అమెరికన్ డాలర్లుగా నిర్ణయించారు. మన కరెన్సీలో అయితే అది దాదాపు రూ. 11 వేలు ఉంటుంది. ఏంటీ ఇది కూడా ఎక్కువే అనుకుంటున్నారా?
బేస్ బాల్ విభాగంలో జరిగే వరల్డ్ సరిసీ టైటిల్ 2021 ఎడిషన్ లో అట్లాంటా బ్రేవ్స్ చాంపియన్ గా నిలిచింది. తమ జట్టు టైటిల్ ను సొంతం చేసుకోవడంతో దానిని డిఫరెంట్ గా సెలబ్రేట్ చేసుకావాలని టీం హోం గ్రౌండ్ ట్రుయిస్ట్ పార్క్ భావించింది. అంతే కాస్టలీ బర్గర్ లను తయారు చేయడం స్టార్ట్ చేసింది. అయితే ఈ బర్గర్ ను మిగతా అన్ని బర్గర్ లలానే తయారు చేస్తారు. అయితే ఎందుకింత ధర అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా.. దీని ధర 25 లక్షలు ఉండటానికి ప్రధాన కారణం... బర్గర్ తో పాటు వీరు తమ అభిమానులకు లిమిటెడ్ ఎడిషన్ చాంపియన్ షిప్ రింగ్ ను అందించడమే...
Burger that Braves are selling for $151:
A Wagyu beef patty with cage-free pan-fried eggs, gold-leaf-wrapped foie gras, grilled cold water lobster tail, heirloom tomato, Tillamook cheddar cheese and truffle aioli on a toasted, buttered bun served with Parmesan waffle fries. pic.twitter.com/wlcUF6oe2O
ఇక 11 వేల రూపాయల బర్గర్ లో మాత్రం రింగ్ వరల్డ్ సిరీస్ రింగ్ నకలు (replica) ఉంచి ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ బర్గర్ న్యూస్ అటు అమెరికాతో పాటు ఇటు ఇతర దేశాల్లో కూడా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. దీనిపై పలువురు సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్స్ వైరల్ కూడా అవుతున్నాయి.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.