హోమ్ /వార్తలు /క్రీడలు /

Sania : సానియా మీర్జా-షోయబ్ మాలిక్ దంపతులకు యూఏఈ గోల్డెన్ వీసా.. ఈ వీసా ఎందుకిస్తారు?

Sania : సానియా మీర్జా-షోయబ్ మాలిక్ దంపతులకు యూఏఈ గోల్డెన్ వీసా.. ఈ వీసా ఎందుకిస్తారు?

సానియా దంపతులకు గోల్డెన్ వీసా మంజూరు చేసిన యూఏఈ (ఫైల్)

సానియా దంపతులకు గోల్డెన్ వీసా మంజూరు చేసిన యూఏఈ (ఫైల్)

స్పోర్ట్స్ సెలెబ్రిటీలు సానియా మీర్జా - షోయబ్ మాలిక్‌లకు యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా మంజూరు చేసింది. అసలు గోల్డెన్ వీసా అంటే ఏంటి? గతంలో ఎవరెవరికి గెల్డెన్ వీసా మంజూరయ్యింది.?

  భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా (Sania Mirza) పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను  (Shoiab Malik) 2010లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన సానియా మీర్జా, పాకిస్తాన్‌లోని సియాల్ కోట్‌కు చెందిన షోయబ్ మాలిక్ పెళ్లైన తర్వాత దుబాయ్‌లో ఉంటున్నారు. వారిద్దరూ తమ మూడున్నరేళ్ల ముద్దుల కొడుకు ఇజహాన్‌తో కలసి అక్కడే నివసిస్తున్నారు. ఇక సానియా అప్పుడప్పుడు ఇండియా వచ్చి వెళ్తుండగా.. షోయబ్ మాత్రం పాకిస్తాన్‌లో క్రికెట్ ఆడుతూ వీలున్నప్పుడు దుబాయ్ వెళ్తున్నాడు. గత పదేళ్లుగా అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఈ జంట తమ ఆటకు సంబంధించిన షెడ్యూల్ ఉన్నప్పుడు ప్రయాణాలు చేస్తున్నారు. వీరిద్దరికీ యూఏఈ (UAE) ప్రభుత్వం గోల్డెన్ వీసాను (Golden Visa) మంజూరు చేసింది. కాగా, యూఏఈ ప్రభుత్వం 2019లో గోల్డెన్ వీసా పథకాన్ని అమలులోకి తెచ్చింది. ఈ కొత్త వీసా నిబంధనల ప్రకారం ఎవరైనా యూఏఈలో సుదీర్ఘ కాలం నివాసం ఉండవచ్చు. విదేశాలకు చెందిన వాళ్లు యూఏఈలో సొంతగా బిజినెస్ ప్రారంభించాలనుకునే వారికి, సెలెబ్రిటీలకు ఈ వీసా అందిస్తారు. యూఏఈకి చెందిన వ్యక్తులు ఎవరూ స్పాన్సర్ చేయకుండానే ఈ వీసాను నేరుగా వ్యాపారాలు చేసుకునే వాళ్లు, ప్రొఫెనల్స్, ప్రత్యేకమైన టాలెంట్స్ కలిగిన వారికి ఈ వీసాలు మంజూరు చేస్తారు. ఈ వీసా కాలపరిమితి 5 లేదా 10 ఏళ్ల పాటు ఉంటుంది. గడువు తీరిన తర్వాత అటోమేటిగ్గా రెన్యూవల్ అవుతుంది. ఆ కోటాలో సానియా మీర్జా - షోయబ్ మాలిక్ దంపతకులకు యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాను మంజూరు చేసింది. వీరు త్వరలో దుబాయ్ కేంద్రంగా ఒక స్పోర్ట్స్ కంపెనీని ప్రారంభించే యోచనలో ఉన్నారు. అందుకే యూఏఈ ప్రభుత్వం వారికి గోల్డెన్ వీసా మంజూరు చేసింది.

  తమకు గోల్డెన్ వీసా మంజూరైన విషయాన్ని సానియా-మాలిక్ దంపతులు ఒక ప్రకటనలో తెలిపారు. 'మేమిద్దరం ఇక్కడే కలసి కొన్నాళ్లు గడపాలని అనుకుంటున్నాము. యూఏఈలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిని మా కొడుకు ఇజహాన్‌తో కలసి చూస్తాము. అంతే కాకుండా మా సొంత స్పోర్ట్స్ వెంచర్‌ను కూడా ప్రారంభించబోతున్నాము' అని ఆ ప్రకటనలో తెలిపారు. ఇక ఇటీవలే అకడమిక్స్‌లో అత్యత్తమ ప్రతిభ కలిగిన విద్యార్థులకు, కోడింగ్ రాసే ప్రోగ్రామర్లకు గోల్డెన్ వీసాలు మంజూరు చేసింది.

  BCCI : కోవిడ్ వచ్చినా ఎవరినీ పంపేది లేదు.. ఉన్న వారితోనే సిరీస్ ఆడి రండి.. బీసీసీఐ అల్టిమేటం

   యూఏఈ ప్రభుత్వం గతంలో ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో, మరో ఫుట్‌బాలర్ లూయిస్ ఫిగోకు గోల్డెన్ వీసా మంజూరు చేసింది. టెన్నిస్ వరల్డ్ నెంబర్ 1 ర్యాంకర్ నోవాక్ జకోవిచ్‌కు కూడా యూఏఈ గోల్డెన్ వీసా ఉన్నది. ఇక మన బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్, సంజయ్ దత్‌లు కూడా గోల్డెన్ వీసా హోల్డర్లే. షారుక్‌కు బుర్జ్ ఖలీఫాలో ఒక అపార్ట్‌మెంట్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. బాద్షా ఎక్స్‌ప్లోర్ దుబాయ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉన్నాడు.

  Published by:John Kora
  First published:

  Tags: Cricket, Sania Mirza, Shoaib Malik, Tennis, UAE, Visa

  ఉత్తమ కథలు