news18-telugu
Updated: December 1, 2020, 1:41 PM IST
సచిన్ టెండుల్కర్(ఫైల్ ఫోటో)
భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ సచిన్ టెండూల్కర్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నాడు. క్రికెట్ ఫీల్డ్ లోనే కాదు.. సాయం చేయడంలోనూ తనకు తానే సాటి అన్పించుకున్నాడు. వివిధ వ్యాధులతో బాధపడుతున్న 100 మంది అనాథ చిన్నారులకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి ముందుకొచ్చాడు.
భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ సచిన్ టెండూల్కర్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నాడు. క్రికెట్ ఫీల్డ్ లోనే కాదు.. సాయం చేయడంలోనూ తనకు తానే సాటి అన్పించుకున్నాడు. వివిధ వ్యాధులతో బాధపడుతున్న 100 మంది అనాథ చిన్నారులకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి ముందుకొచ్చాడు. ఈ విషయాన్ని మాస్టర్ తో కలిసి పని చేస్తున్న 'ఏకం' చారిటీ ఫౌండేషన్ వెల్లడించింది. తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు ప్రభుత్వ, ట్రస్ట్ ఆసుపత్రుల్లో సరైన ట్రీట్మెంట్ ఇప్పించడంలో ఏకం కీలక పాత్ర పోషిస్తోంది.
ఇందులో భాగంగానే మహారాష్ట్ర, బెంగాల్, అసోం, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని చిన్నారుల చికిత్సకు అయ్యే ఖర్చును సచిన్ భరించనున్నాడు. 'సచిన్‌తో అసోసియేషన్ చాలా సంతోషంగా సాగుతోంది. హెల్త్ కేర్ విభాగంలో మాస్టర్ చాలా అద్భుతమైన సేవలు చేస్తున్నాడు. అనాధ పిల్లలకు క్వాలిటీ ట్రీట్మెంట్ ఇప్పించడంలో కృషి చేస్తామని ఏకం ఫౌండేషన్ మేనేజింగ్ పార్ట్నర్ అమితా చటర్జీ వెల్లడించారు.
గత నెలారంభంలో అసోంకు చెందిన మకుంద ఆసుపత్రికి పిల్లల అత్యవసర విభాగానికి పీడియాట్రిక్ పరికరాలను కూడా సచిన్ అందించాడు. దీనిద్వారా ప్రతీ ఏడాది 2వేల మంది చిన్నారులు లబ్ది పొందనున్నారు. అలాగే, మధ్యప్రదేశ్‌లోని గిరిజన తెగల్లోని చిన్నారులకు కూడా పోషకాహారం, విద్యా వసతులను సచిన్ ఫౌండేషన్ అందించింది. క్రికెట్ కెరీర్ లో వంద సెంచరీలు చేసిన మాస్టర్.. వంద మంది చిన్నారులకు సాయం చేసి తన సెకండ్ ఇన్నింగ్స్ ను కూడా పరుగులు పెట్టిస్తున్నాడు.
Published by:
Rekulapally Saichand
First published:
December 1, 2020, 1:36 PM IST