Home /News /sports /

SPORTS NEWS INDIAN ACTOR MADHAVAN SON VEDAANT MADHAVAN WON GOLD AND SILVER AT DANISH OPEN SWIMMING TOURNEY SJN

Vedaant madhavan : స్టార్ హీరో కొడుకు.. స్విమ్మింగ్ లో ఇప్పుడో సంచలనం.. పతకాలతో అదరగొట్టేస్తున్నాడుగా.!

కొడుకు వేదాంత్ తో మాధవన్ (PC: INSTAGRAM)

కొడుకు వేదాంత్ తో మాధవన్ (PC: INSTAGRAM)

Vedaant madhavan :భారత్ (Indian) నుంచి స్విమ్మింగ్ (Swimming) లో అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధించడం చాలా అరుదైన విషయం. అయితే తాజాగా ఓ 16 ఏళ్ల కుర్రాడు అంతర్జాతీయ వేదికలపై వరుస పెట్టి భారత్ కు పతకాలు తెచ్చిపెడుతున్నాడు.

Vedaant madhavan :భారత్ (Indian) నుంచి స్విమ్మింగ్ (Swimming) లో అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధించడం చాలా అరుదైన విషయం. అయితే తాజాగా ఓ 16 ఏళ్ల కుర్రాడు అంతర్జాతీయ వేదికలపై వరుస పెట్టి భారత్ కు పతకాలు తెచ్చిపెడుతున్నాడు. అతడెవరో కాదు ప్రముఖ నటుడు మాధవన్ (Madhavan) కుమారుడు. అవును తమిళ హీరో మాధవన్ కుమారుడు వేదాంత్ మాధవన్ (vedaant madhavan) ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై స్విమ్మింగ్ క్రీడలో భారత ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నాడు. డెన్మార్క్ (Denmark) వేదికగా జరుగుతోన్న డానిష్ ఓపెన్ అంతర్జాతీయ స్విమ్మింగ్ టోర్నమెంట్ లో వేదాంత్.. రెండు రోజుల్లో రెండు పతకాలు సాధించి అదరగొట్టాడు.

ఇది కూడా చదవండి : బెర్ముడా ట్రయాంగిల్.. ఏరియా 51.. విజయ్ శంకర్.. మీమ్స్ తో 3D ప్లేయర్ ను ఆడేసుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్

ఏప్రిల్ 17న జరిగిన పురుషుల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో వేదాంత్ త్రుటిలో బంగారు పతకాన్ని కోల్పోయాడు. ఆ పోటీలో రెండో స్థానంలో నిలిచిన అతడు రజత పతకాన్ని అందుకున్నాడు. ఇక ఏప్రిల్ 18వ తేదీన (సోమవారం) జరిగిన పురుషుల 800 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో పసిడి పతకంతో మెరిశాడు. వేదాంత్‌ 800 మీటర్ల లక్ష్యాన్ని 8 నిమిషాల 17:28 సెకన్లలో పూర్తి చేయడం విశేషం. కొడుకు సాధిస్తోన్న విజయాల పట్ల గర్వంగా ఉన్న మాధవన్.. ఈ అద్భుత విజయానికి సంబంధించిన వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో ఉంచాడు. ఇందులో వేదాంత్ కు బంగారు పతకాన్ని బహూకరించడం ఉంది.








View this post on Instagram






A post shared by R. Madhavan (@actormaddy)






ఇక గతేడాది జరిగిన జాతీయ జూనియర్ చాంపియన్ షిప్ లో వేదాంత్ ఏడు పతకాలతో అదరగొట్టాడు. ఇందులో నాలుగు రజతాలు, మూడు కాంస్య పతకాలు ఉండటం విశేషం. ఇక అనంతరం జరిగిన లాత్వియా ఓపెన్ లో కాంస్యం పతకం సాధించాడు. తాజాగా డానిష్ ఓపెన్ లో రెండు రోజుల్లో రెండు పతకాలు సాధించి అబ్బుర పరిచాడు. కొడుకు అంతర్జాతీయ వేదికలపై వరుస విజయాలు సాధిస్తూ పతకాలు సాధిస్తుండటంతో తండ్రి మాధవన్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు.
వేదాంత్‌ సాధించిన విజయాల పట్ల యావత్‌ భారతం ఆనందం వ్యక్తం చేస్తుంది. వేదాంత్ ఇదే విధంగా కష్టపడితే ఒలింపిక్స్ లో భారత్ కు స్విమ్మింగ్ విభాగంలో పతకం వచ్చే అవకాశం ఉందని కామెంట్స్ చేస్తున్నారు. హీరో మాధవన్ తెలుగు, తమిళ భాషలో పలు చిత్రాల్లో నటించిని సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ లో నటుడుగా రాణిస్తున్నాడు. అయితే తన కొడుకును తనలా హీరోని చేయకుండా అథ్లెట్ ను చేయడం విశేషం.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Bollywood, India, Kollywood, Madhavan, Olympics, Swimming, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు