హోమ్ /వార్తలు /క్రీడలు /

Smart Ball: క్రికెట్‌లో మరో ఆవిష్కరణ.. సీపీఎల్‌లో చిప్‌తో కూడిన స్మార్ట్ బాల్.. దీని విశేషాలు ఏంటో తెలుసా?

Smart Ball: క్రికెట్‌లో మరో ఆవిష్కరణ.. సీపీఎల్‌లో చిప్‌తో కూడిన స్మార్ట్ బాల్.. దీని విశేషాలు ఏంటో తెలుసా?

క్రికెట్‌లో స్మార్ట్ బంతులు.. సీపీఎల్‌లో ప్రవేశపెట్టిన కూకబూరా (PC: Kookaburra/Sportcor/Twitter)

క్రికెట్‌లో స్మార్ట్ బంతులు.. సీపీఎల్‌లో ప్రవేశపెట్టిన కూకబూరా (PC: Kookaburra/Sportcor/Twitter)

క్రికెట్ బంతులు తయారు చేసే ప్రముఖ కంపెనీ కూకబూరా సంస్థ స్పోర్ట్ కోర్ టెక్నాలజీ సంస్థతో కలసి స్మార్ట్ బంతిని ఆవిష్కరించాయి. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో తొలి సారిగా ఈ బంతులను వాడుతున్నారు.

ప్రపంచంలో ఇప్పుడు ప్రతీ విషయంలో టెక్నాలజీ (Technology) వాడకం బాగా పెరిగిపోయింది. క్రీడల్లో టెక్నాలజీని ఉపయోగించి అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ఒకప్పుడు అంపైర్లు/రిఫరీల మీద ఆధారపడే వాళ్లు. అయితే మానవతప్పిదాలను తగ్గించడానికి టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఆటలో అనేక నిబంధనలను మార్చేశారు. ముఖ్యంగా క్రికెట్‌లో (Cricket) రనౌట్‌, స్టంపింగ్‌ల కొరకు టీవీ రిప్లైల దగ్గర మొదలైన టెక్నాలజీ వాడకం.. ఇప్పుడు మరింత విస్తృతంగా మారిపోయింది. ముఖ్యంగా డెషిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్) (DRS) వాడకం ఎక్కువగా పెరిగిపోయింది. ప్రస్తుత క్రికెట్‌లో డీఆర్ఎస్‌ చాలా కీలకంగా మారింది. అయితే ఇప్పటికీ ఇందులో కొన్ని లోపాలు ఉన్నాయి. బౌలర్ బంతి విసిరిన తర్వాత దాని దిశకు సంబంధించి కొన్ని అనుమానాలను సరి చేయాల్సి ఉన్నది. దీంతో అంపైర్స్ కాల్ అనే దానిపై ఆధారపడుతున్నారు. కాగా, ఇప్పుడు ఆ బంతి దిశను, వేగాన్ని కూడా స్పష్టంగా అంచనా వేయడానికి సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొని వచ్చారు. ప్రముఖ బంతుల తయారీ కంపెనీ కూకబూరా (Kookaburra), స్పోర్ట్స్ టెక్నాలజీ సంస్థ స్పోర్ట్ కోర్ కలసి స్మార్ట్ బంతిని తయారు చేశాయి. సాధారణ తెల్లని బంతి ఎలా ఉంటుందో.. సేమ్ బరువు, ఆకారంలో ఎలాంటి మార్పులేకుండా ఉండే ఈ బంతిలో ఒక మైక్రో చిప్‌ను అమర్చారు.

కూకబూర స్మార్ట్ బంతిలో అమర్చిన చిప్‌లో ఉన్న సెన్సార్లు.. బౌలర్ బంతిని విసిరిన శక్తి, బంతి రిలీజ్ సమయంలో వేగం, బంతి పిచ్‌ను తాకిన తర్వాత వేగంతో పాటు బ్యాట్స్‌మెన్ దగ్గరకు వచ్చే సరికి ఎంత వేగంతో ఉన్నదో కూడా చూపిస్తుంది. అంతే కాకుండా బంతి పిచ్‌పై పడిన తర్వాత ఎన్ని సార్లు గుండ్రంగా తిరిగిందో కూడా చెబుతుంది. బ్లూటూత్ టెక్నాలజీతో పని చేసే ఈ బంతి సగటున 5 సెకెన్లలోనే ఈ వివరాలన్నింటినీ కంప్యూటర్లకు చేరవేస్తుంది. కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసే ఒక యాప్ ద్వారా ఈ సమాచారం అంతా మనకు ఎప్పటికప్పుడు తెలుస్తుంది. స్మార్ట్ వాచ్‌లకు కూడా ఈ బంతి సమాచారాన్ని ఇచ్చే సదుపాయం కలిగి ఉన్నది. ఒక బంతిలో ఉండే బ్యాటరీ 30 గంటల పాటు పని చేస్తుంది. సాధారణ కూకాబూరా బంతిని పోలి ఉండే ఈ స్మార్ట్ బంతి వల్ల రాబోయే రోజుల్లో క్రికెట్‌లో అనేక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నది. బంతిలోని రబ్బరు కార్క్‌ను కొంచెం తొలగించి ఈ చిప్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల బంతిలో ఎలాంటి మార్పు లేదు. అదే క్వాలిటీతో బంతిని తయారు చేసినట్లు కూకబూరా కంపెనీ తెలిపింది. ఎంతటి హార్డ్ హిట్టర్లు కొట్టినా బంతి పగలడం లేదా చిప్ పాడవటం జరగదని సంస్థ చెబుతున్నది.

కూకబూరా స్మార్ట్ బంతి ఇలా పని చేస్తుంది..

' isDesktop="true" id="1011324" youtubeid="d_sLre0qo3g" category="sports">

ఈ స్మార్ట్ బంతిని తొలి సారిగా గురువారం నుంచి ప్రారంభమైన కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఉపయోగించారు. బంతి నుంచి వస్తున్న సమాచారాన్ని కామెంటేటర్ల స్క్రీన్లపైనే కాకుండా లైవ్ టెలికాస్ట్‌లో ప్రేక్షకులకు కూడా చూపించారు. 'కూకబూరా స్మార్ట్ బంతులను తొలిసారిగా సీపీఎల్‌ ద్వారా ఆవిష్కరించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. ఈ బంతి ఇచ్చే సమాచారం ద్వారా ఈ సారి సీజమ్ మరింత ఆసక్తికరంగా మారబోతున్నది. అంతే కాకుండా విలువైన సమాచారాన్ని ఆయా జట్లు తెలుసుకునే అవకాశం కలిగింది' అని సీపీఎల్ సీఈవో పీట్ రస్సెల్ అన్నారు.

Cricketer's Pet Dogs: కుక్కలు.. క్రికెటర్లకు మంచి స్నేహితులు.. టీమ్ ఇండియాలో పెరిగిన పెట్ లవర్స్


First published:

Tags: Cricket, Latest Technology