నిత్యానంద వద్దకు వెళ్తానంటున్నటీమిండియా క్రికెటర్

నిత్యానంద సెంట్రల్ లాటిన్ అమెరికాలోని ట్రినిడాడ్ అండ్ టొబాగో సమీపంలో ఓ దీవిని కొనుగోలు చేసి.. దాన్ని తన సొంత దేశంగా ప్రకటించుకున్నాడు. ఆ దేశానికి ‘కైలాస’ అని పేరు కూడా పెట్టుకున్నాడు.

news18-telugu
Updated: December 4, 2019, 4:39 PM IST
నిత్యానంద వద్దకు వెళ్తానంటున్నటీమిండియా క్రికెటర్
నిత్యానంద
  • Share this:
వివాదాస్పద స్వామీజీ కొత్త దేశంపై ఇప్పుడు దేశమంతటా చర్చ జరగుతోంది. రేప్ కేసులో నిందితుడిగా ఉన్న నిత్యానంద భారత్ నుంచి పారిపోయి ఈక్వెడార్ సమీపంలో ఓ దీవిని కొనుగోలు చేసినట్లు అనధికార వర్గాలు ధృవీకరించాయి. ఆ దీవిని స్వతంత్ర దేశంగా ప్రకటించి కైలాసంగా నామకరణం కూడా చేశారు నిత్యానంద. ఐతే ఆ నిత్యానందుడి రాజ్యంపై టీమిండియా క్రికెట్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తి చూపించారు. కైలాసానికి వెళ్లేందుకు వీసా ఎలా పొందాలి? లేదంటే అక్కడికి వెళ్లాక (వీసా ఆన్ ఆరైవల్) వీసా ఇస్తారా అంటూ ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టారు అశ్విన్. అశ్విన్ ట్వీట్‌పై నెజిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కేవలం చూడాడానికే వెళ్తారా? లేదంటే ఆ దేశ పౌరుడిగా మారిపోతారా? అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించగా.. భారత్‌లో రెండు పౌరసత్వాలు పెద్ద మ్యాటర్ కాదంటూ ఫన్నీ రిప్లై ఇచ్చాడు అశ్విన్. అంతేకాదు కైలాసంలో పెట్టుబడులు పెట్టేవారికి ఏమైనా ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయా అని నెటిజన్లను అడిగాడు. ఇలా ట్విటర్‌లో నిత్యానందుడి కైలాసంపై ఫన్నీ ఫన్నీగా చర్చ జరిగింది.

అనధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. నిత్యానంద సెంట్రల్ లాటిన్ అమెరికాలోని ట్రినిడాడ్ అండ్ టొబాగో సమీపంలో ఓ దీవిని కొనుగోలు చేసి.. దాన్ని తన సొంత దేశంగా ప్రకటించుకున్నాడు. ఆ దేశానికి ‘కైలాస’ అని పేరు కూడా పెట్టుకున్నాడు. ఒక ప్రభుత్వాన్ని, ప్రధాన మంత్రిని, కేబినెట్‌ను కూడా ఏర్పాటు చేశారు. రోజూ కేబినెట్‌ భేటీలు కూడా జరుపుతున్నారని తెలుస్తోంది. కైలాసకు సొంతంగా పాస్‌పోర్టు ఉంది. జాతీయ జెండా, జాతీయ చిహ్నాలు సైతం ఉన్నాయి.

అంతేకాదు కైలాస దేశం కోసం kailaasa.org పేరుతో వెబ్‌సైట్‌ను కూడా ఆవిష్కరించారు నిత్యానంద. కైలాస ప్రధానిగా 'మా'ని నియమించారని, గోల్డ్, రెడ్‌ కలర్లలో పాస్‌పోర్ట్‌ను రూపొందించారని వెబ్‌సైట్‌ పేర్కొంది. కైలాస.. ఈ భూమండలంపై ఉన్న గొప్ప హిందూ దేశమని నిత్యానంద వెల్లడించారు. తమది సరిహద్దులు లేని దేశమని, తమ తమ దేశాల్లో స్వేచ్ఛగా హిందూయిజాన్ని అనుసరించలేని వారి కోసం ఈ దేశం ఏర్పాటయిందని వెబ్‌సైట్లో పేర్కొన్నారు నిత్యానంద. తన 'కైలాస'కు ఒక దేశంగా గుర్తింపునివ్వాలని ఐక్యరాజ్య సమితికి నిత్యానంద విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తోంది.
Published by: Shiva Kumar Addula
First published: December 4, 2019, 4:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading