• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • SPECULATION OVER MS DHONI FUTURE DHONIRETIRES APPEARED ON TWITTER MK

ధోనీ రిటైర్మెంట్‌పై నెట్టింట్లో కలకలం...ఆందోళనలో అభిమానులు

ధోనీ రిటైర్మెంట్‌పై నెట్టింట్లో కలకలం...ఆందోళనలో అభిమానులు

ధోనీ

తమ అభిమాన క్రికెటర్ కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడి.. రిటైర్‌మెంట్ ప్రకటిస్తే బాగుంటుంది అని అంతా ఒక్కసారిగా కంగారు పడ్డారు.

  • Share this:
    టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ రిటైర్‌మెంట్ తీసుకున్నాడంటూ.. వార్తలు రావడం ప్రారంభమైంది. అంతేకాక.. ట్విట్టర్‌లో ధోనీ రిటైర్స్ అనే హ్యాష్‌ట్యాగ్ కూడా రాత్రికిరాత్రి వైరల్‌ అయ్యింది. ఈ హ్యాష్‌ట్యాగ్‌తో పాటు.. థ్యాంక్యూధోనీ, నెవర్‌రిటైర్‌ధోనీ అనే ట్యాగ్స్‌ కూడా వైరల్ కావడంతో నెటిజన్లతో పాటు ధోనీ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. తమ అభిమాన క్రికెటర్ కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడి.. రిటైర్‌మెంట్ ప్రకటిస్తే బాగుంటుంది అని అంతా ఒక్కసారిగా కంగారు పడ్డారు. అయితే ఇదంతా కల్పితమని, ధోనీ వైపు నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని.. కొందరు పుకారు పుట్టించారనే విషయం తెలియడంతో.. అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాక.. ఆ హ్యాష్‌ట్యాగ్స్ చూసి కంగారు పడ్డ వాళ్లకి.. ఇది ఫేక్ వార్త అని ధోనీ సన్నిహితులు సైతం తోసి పుచ్చారు. ధోనీ 2020లో జరిగే టీ-20 ప్రపంచకప్ కచ్చితంగా ఆడి తీరుతాడని అంతా భావిస్తున్నారు.
    First published:

    అగ్ర కథనాలు