క్రికెట్(Cricket) అంటేనే ఓ అద్భుతం అంటారు.. అందులోనూ ధనాధన్ ఫార్మట్ టీ20 వచ్చాక ఆట ఇంకాస్త అదుర్స్ అనిపిస్తోంది. అభిమానులను ఫుల్ మీల్స్ లాంటి విందు అందిస్తోంది. ఇక అందులో ఆటగాళ్లు చేసే అద్భుత విన్యాషాలు నెవ్వర్ భిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అనేలా ఉంటాయి. క్రికెట్ చరిత్రలో ఎన్నో అద్భుత క్యాచ్ ల్ని మనం చూశాం. కానీ, ఇప్పుడు చూడబోయే వీడియో మాత్రం మన గుండెలకు హత్తుకోవడం మాత్రం ఖాయం. ఎందుకంటే.. అది వికలాంగుల మ్యాచ్‌లో జరిగిన ఓ సంఘటన. వికలాంగుల మ్యాచ్ అంటే ఆసక్తి ఉండదని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. కానీ, ఈ మ్యాచ్‌లో ఓ బౌలర్ ఏకంగా ప్రొఫెషనల్ క్రికెట్‌లా ఆడి తన సత్తా చాటి, ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాడు. ప్రత్యేక సామర్థ్యం ఉన్న ఓ బౌలర్ ఒంటి చేత్తో క్యాచ్ తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పూర్తి వివరాల్లోకెళితే.. ఈ వీడియో క్లిప్‌లో, వికలాంగులైన బౌలర్ బ్యాట్స్‌మెన్ కొట్టిన బంతిని అందుకునేందుకు చాలా రిస్క్ చేసి మరీ ఔట్ చేశాడు. అతను కర్ర సహాయంతో రన్నింగ్ చేసి బౌలింగ్ చేయడం ఒక ఎత్తైతే.. లాంగ్-ఆఫ్‌లోకి వెళ్తున్న బంతిని వెంటాడి ఒంటి చేత్తో పట్టుకుని ఔరా అనిపించాడు. ఇది ఎక్కడి జరిగిందో తెలియదు కానీ, వీడియో మాత్రం బాగా ఆకట్టుకుంటోంది. ఓ బౌలర్ ఒక ఫుల్ లెంగ్త్ డైవ్ చేసి ఒక చేత్తో బంతిని పట్టుకున్నాడు. ఈ ప్రక్రియలో అతను తన కర్రను కూడా విడిచిపెట్టి మరీ.. అతని సహచరులను విస్మయానికి గురిచేశాడు.
Melts my heart 😟🥺 pic.twitter.com/2BIg68PfFV
— Tony (@ProudSuriyaFan) September 1, 2021
Wow!!! That's all I can say 😭 https://t.co/7VXIdYoHtA
— Tabraiz Shamsi (@shamsi90) September 2, 2021
Unreal stuff! https://t.co/FMhWdeBfeX
— Mitchell McClenaghan (@Mitch_Savage) September 2, 2021
ఈ వీడియో ఇప్పుడు తెగ వైరలవుతోంది. ఈ క్రికెటర్ పట్టిన క్యాచ్ కి ఇంటర్నేషనల్ క్రికెటర్లు కూడా ఫిదా అయ్యారు. దక్షిణాఫ్రికా స్పిన్నర్ తబరైజ్ షమ్సీ క్లిప్ చూసిన తర్వాత భావోద్వేగానికి గురవుతూ కామెంట్ చేశారు. “వావ్ !!! నేను చెప్పగలిగేది ఇది ఒక్కటే ” అని ఏడుపు ముఖం ఉన్న ఎమోజీతో పాటు ట్వీట్ చేశాడు. న్యూజిలాండ్ పేసర్ మిచెల్ మెక్‌క్లెనాఘన్ కూడా “నమ్మలేకపోతున్నా..!” అనే క్యాప్షన్‌తో వీడియోను రీట్వీట్ చేశారు.
ఇది కూడా చదవండి : వాల్‌నట్స్ తింటే బాడీలో జరిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..
మరోవైపు, ఈ నెలలో ఐపీఎల్ మలిదశ సందడి మొదలు కానుంది. ఇప్పటికే ఐపీఎల్ జట్లు యూఏఈ చేరుకుని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడ్డ ఐపీఎల్ సెకండ్ లెగ్ ఈ నెల 19 న ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 19 న చెన్నై సూపర్ కింగ్స్ తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ ధనా ధన్ లీగ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Sports, Trending videos, Viral Video, Viral Videos