క్రికెట్ ప్రపంచకప్ పండుగ వచ్చేస్తోంది!!

2019 వన్డే వరల్డ్‌కప్ ప్రమోషన్స్ క్రికెట్ అభిమానులను అలరిస్తున్నాయి. ఐసీసీ స్పెషల్ ప్రమోషనల్ వీడియోస్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నీగా పేరున్న వన్డే ప్రపంచకప్‌పై అంచనాలను మరింత పెంచేస్తున్నాయి.

news18-telugu
Updated: August 8, 2018, 1:52 PM IST
క్రికెట్ ప్రపంచకప్ పండుగ వచ్చేస్తోంది!!
2019 వన్డే ప్రపంచకప్ ప్రమోషనల్ వీడియోలో మాజీ క్రికెటర్ ఫ్లింటాఫ్ (Credit:ICC/Twitter)
  • Share this:
నాలుగేళ్లకు ఓ సారి జరిగే వన్డే వరల్డ్ కప్ పోటీలు ఎప్పుడెప్పుడు ఆరంభమవుతాయా అని క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ 2019 వన్డే వరల్డ్‌కప్ విడుదల చేస్తోన్న ప్రమోషనల్ వీడియోలు టోర్నీపై అంచనాలను మరింత పెంచేస్తున్నాయి.ప్రపంచకప్ కోసమే ఐసీసీ ప్రత్యేకంగా ప్రమోషనల్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది.ఇంగ్లండ్ వేదికగా జరుగనున్న 12వ వరల్డ్ కప్‌ పోటీల కోసం..పుట్టింటికి ప్రపంచకప్ వచ్చేస్తోందంటూ వినూత్న ప్రమోషనల్ వీడియోలతో క్రికెట్ అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది.తాజాగా విడుదల చేసిన వీడియోలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ సందడి చేశాడు.


ప్రపంచ కప్ పండుగ వచ్చేస్తోంది.
ఐసీసీ


2019 వన్డే వరల్డ్‌కప్‌లో పోటీకి దిగే 10 జట్లు ఇప్పటికే ఖరారయ్యాయి.10 జట్లలో ఒక్కో జట్టు గ్రూప్ దశలో 9 మ్యాచ్‌లు ఆడాలి.గ్రూప్ దశ ముగిసిన తర్వాత టాప్ 4లో నిలిచిన జట్ల మధ్య సెమీఫైనల్స్ నిర్వహిస్తారు.సెమీస్ దాటిన జట్ల మధ్య టైటిల్‌ ఫైట్ జరుగనుంది.
10 జట్లు..10 నగరాలు..11 వేదికలు..2019 ఐసీసీ వరల్డ్ కప్ వచ్చేస్తోంది.
ఐసీసీఈ మెగా టోర్నీ 2019,మే 30న ప్రారంభమై జులై 14న ముగుస్తుంది.2019 ప్రపంచకప్ టోర్నీషెడ్యూల్‌‌పై విమర్శలు వినిపిస్తోన్నా.. టైటిల్ నెగ్గాలంటే గ్రూప్ దశలో 9 మ్యాచ్‌లతో పాటు సెమీస్ దాటుకుని ఫైనల్ చేరాల్సిందే.ప్రతిష్టాత్మక 2019 వన్డే వరల్డ్‌కప్ పోటీలకు ఇంగ్లండ్‌,వేల్స్ దేశాలు సంయుక్తంగా ఆతిధ్యమివ్వనున్నాయి.
Published by: Prasanth P
First published: August 8, 2018, 1:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading