Home /News /sports /

Viral Video : ఇదేందయ్యా ఇది.. ఒక క్యాచ్ ని ముగ్గురు పట్టారు..! కానీ, చివరికి కొంపముంచారుగా..

Viral Video : ఇదేందయ్యా ఇది.. ఒక క్యాచ్ ని ముగ్గురు పట్టారు..! కానీ, చివరికి కొంపముంచారుగా..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Viral Video : మ్యాచ్ లో క్వీన్స్‌ల్యాండ్ ఇన్నింగ్స్ 36 వ ఓవర్ వేసిన బ్రెండన్ డాగెట్ బౌలింగ్‌లో మైఖేల్ నాసర్ స్క్వేర్ లెగ్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించగా.. అది మిస్‌ టైమ్‌ అయ్యి బంతి గాల్లోకి లేచింది.

    క్రికెట్ (Cricket News) అంటేనే ఓ అద్భుతం అంటారు.. అందులోనూ ధనాధన్ ఫార్మట్ టీ20 (T20 Format) వచ్చాక ఆట ఇంకాస్త అదుర్స్ అనిపిస్తోంది. అభిమానులను ఫుల్ మీల్స్ లాంటి విందు అందిస్తోంది. ఇక అందులో ఆటగాళ్లు చేసే అద్భుత విన్యాషాలు నెవ్వర్ భిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అనేలా ఉన్నాయ్. అప్పుడప్పుడూ క్రికెట్‌లో సూపర్ మూమెంట్స్ జరుగుతుంటాయి. ఫీల్డర్స్ మెరుపు విన్యాసాలు కావొచ్చు. వికెట్ కీపర్ల నైపుణ్యాలు కావచ్చు.. బ్యాటర్ల అద్భుతమైన షాట్స్ కావొచ్చు.. ఇలా ఎన్నో జరుగుతాయి. ఇలాంటి అద్భుతమే ఆస్ట్రేలియా (Australia) లో జరుగుతున్న మార్ష్ కప్ టోర్నమెంట్ (Marsh Cup Tournament) లో చోటు చేసుకుంది. అసలు విషయంలోకి వెళ్తే.. మార్ష్ కప్ టోర్నమెంట్‌లో బుధవారం జరిగిన దక్షిణ ఆస్ట్రేలియా, క్వీన్స్‌ల్యాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఓ క్యాచ్‌ను పట్టేందుకు ముగ్గురు ఫీల్డర్స్ ప్రయత్నించారు. కానీ, చివరికి కొంపముంచారు.

    మ్యాచ్ లో క్వీన్స్‌ల్యాండ్ ఇన్నింగ్స్ 36 వ ఓవర్ వేసిన బ్రెండన్ డాగెట్ బౌలింగ్‌లో మైఖేల్ నాసర్ స్క్వేర్ లెగ్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించగా.. అది మిస్‌ టైమ్‌ అయ్యి బంతి గాల్లోకి లేచింది. ఇక క్యాచ్‌ పట్టుకునేందకు ముగ్గురు ఫీల్డర్స్ బౌండరీ లైన్ వైపు పరిగెత్తారు. వీరిలో ఓ ఫీల్డర్ ఆ క్యాచ్‌ను అందుకున్నా.. అతడు అదుపు తప్పి బౌండరీ లైన్ దాటడంతో బంతిని గాల్లోకి విసిరేశాడు.

    మరో ఫీల్డర్‌ దాన్ని అందుకున్నప్పటికి .. అతడు కూడా అదుపు తప్పి బౌండరీ లైన్ దాటడంతో బంతిని గాల్లోకి విసిరేశాడు. ఈ క్రమంలో మూడో ఫీల్డర్‌ కూడా బంతిని అందుకునే క్రమంలో బౌండరీ లైన్ దాటేశాడు. చివరికి వీరి ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో అంపైర్ దాన్ని సిక్స్‌గా ప్రకటించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.


    ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. వర్షం కారణంగా 48 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన సౌత్‌ ఆస్ట్రేలియా 392 పరుగుల భారీ లక్ష్యాన్ని క్వీన్స్‌లాండ్‌ ముందట ఉంచింది. 392 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన క్వీన్స్‌లాండ్‌ 40 ఓవర్లలో 312 పరుగులకే ఆలౌటైంది.

    ఇది కూడా చదవండి : పోలా.. అదిరిపోలా.. ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్‌పై టీమిండియా న్యూ జెర్సీ వెలిగిపోలా..!

    దీంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం 67 పరుగుల తేడాతో సౌత్‌ ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇదే మ్యాచ్‌లో సౌత్‌ ఆస్ట్రేలియా కెప్టెన్‌ ట్రెవీస్‌ హెడ్‌ ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ నమోదు చేశాడు. దీంతో..ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో రెండు డబుల్ సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు హెడ్.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Australia, Cricket, Viral Videos

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు