హోమ్ /వార్తలు /క్రీడలు /

South Africa vs England: క్రికెటర్‌కు కరోనా.. మ్యాచ్ వాయిదా వేసిన సీఎస్‌ఏ

South Africa vs England: క్రికెటర్‌కు కరోనా.. మ్యాచ్ వాయిదా వేసిన సీఎస్‌ఏ

south africa team

south africa team

దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జరగాల్సిన వన్డే మ్యాచ్ వాయిదా పడింది. సఫారీ జట్టులోని ఓ ఆటగాడికి కరోనా సోకడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది

దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన వన్డే మ్యాచ్ వాయిదా పడింది. సఫారీ జట్టులోని ఓ ఆటగాడికి కరోనా సోకడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. కేప్ టౌన్లో వేదికగా శుక్రవారం ఈ రెండు జట్లు మద్య మెుదలు కావాల్సిన తొలి వన్డేను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. పరీక్షల్లో దక్షిణాఫ్రికా ఆటగాడికి కోవిడ్ -19 పాజిటివ్‌గా తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే మ్యాచ్‌ని వాయిదా వేస్తున్నట్లు క్రికెట్ దక్షిణాఫ్రికా కూడా ధృవీకరించింది. తాజాగా శుక్రవారం నిర్వహించిన పరీక్షలో ఆటగాడికి వైరస్‌ సోకినట్లు తేలిందని సీఎస్‌ఏ స్వయంగా ప్రకటించింది


ఆటగాళ్ళ శ్రేయస్సు దృష్ట్యా మ్యాచ్ వాయిదా వేస్తున్నట్లు  క్రికెట్ దక్షిణాఫ్రికా తాత్కాలిక సిఇఒ కుగాండ్రీ గోవెందర్‌తో పాటు ఇసిబి సిఇఒ టామ్ హారిసన్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే టీమ్‌లోని ఆటగాళ్ల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు మెడికల్ టీమ్ సమీక్షిస్తున్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది. #BetwayODI సిరీస్‌కు ముందు ప్రోటోకాల్ ప్రకారం ఆటగాళ్ళకు గురువారం COVID-19 పరీక్షల్లో ఓ ఆటగాడికి పాజీటివ్‌గా తెలింది. తీంతో మ్యాచ్ రద్దచేయాలని క్రికెట్ సౌత్ ఆఫ్రికా నిర్ణయించింది.

First published:

Tags: England, South Africa

ఉత్తమ కథలు