Home /News /sports /

SOUTH AFRICA VS ENGLAND 1992 WORLD CUP SEMI FINAL WORST DECISION IN CRICKET HISTORY THAT COST SOUTH AFRICA TO NOT ENTER INTO FINALS SJN

SA vs ENG: క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త నిర్ణయానికి 30 ఏళ్లు...

దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్  1992 సెమీస్ మ్యాచ్ దృశ్యం (PC: ESPNCRICINFO)

దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ 1992 సెమీస్ మ్యాచ్ దృశ్యం (PC: ESPNCRICINFO)

SA vs ENG: క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త నిర్ణయం 1992 వన్డే ప్రపంచకప్ సందర్భంగా చోటు చేసుకుంది. ఈ నిర్ణయాన్ని ఆటగాళ్లో లేక కోచ్ లో తీసుకోలేదు. సాక్ష్యాత్తు అంపైర్లే తీసుకున్నారు. అది కూడా లెక్కలు వేసి. పాపం ఆ నిర్ణయం వల్ల దక్షిణాఫ్రికా ఇంటి దారి పట్టాల్సి వచ్చింది.

ఇంకా చదవండి ...
SA vs ENG: భారత దేశంలో క్రికెట్ (cricket) ఓ మతం వంటింది. భారత్ తో పాటు ఆస్ట్రేలియా (Australia), ఇంగ్లండ్ (england), బంగ్లాదేశ్ (bangladesh), పాకిస్తాన్ (pakistan) వంటి దేశాలతో పాటు మరికొన్ని దేశాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. అటువంటి క్రికెట్ లో కొన్ని సార్లు తప్పులు జరుగుతుంటాయి. అవి మైదానంలోని ఆటగాళ్ల వల్ల జరగవచ్చు... లేదా ఫీల్డ్ అంపైర్ల వల్ల జరగొచ్చు. మాములు మ్యాచ్ ల్లో తప్పుడు నిర్ణయాల వల్ల ఓడిపోయినా పెద్దగా బాధ ఉండదు. అదే ప్రపంచకప్ (World cup) లాంటి మెగా ఈవెంట్ లో చెత్త నిర్ణయానికి ఓడిపోవడం అంటే ఏమైనా ఉందా.  ఆ జ్ఞాపకం నుంచి బయట పడాలంటే చాలా ఏళ్లు పడుతుంది.

క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త నిర్ణయం 1992 వన్డే ప్రపంచకప్ సందర్భంగా చోటు చేసుకుంది. ఈ నిర్ణయాన్ని ఆటగాళ్లో లేక కోచ్ లో తీసుకోలేదు. సాక్ష్యాత్తు అంపైర్లే తీసుకున్నారు. అది కూడా లెక్కలు వేసి. పాపం ఆ నిర్ణయం వల్ల దక్షిణాఫ్రికా ఇంటి దారి పట్టాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా వేదికగా 1992లో వన్డే ప్రపంచకప్ జరిగింది. సెమీఫైనల్లో ఇంగ్లండ్ తో సఫారీ టీం తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 6 వికెట్లకు 252 పరుగులు చేసింది.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా జట్టు టార్గెట్ వైపు దూసుకెళ్లింది. సౌతాఫ్రికా విజయ సమీకరణం 13 బంతుల్లో 22 పరుగులుగా ఉంది. అంటే ఓవర్ కు 11 పరుగులు చొప్పున రాబట్టాలి. అయితే ఇక్కడే ట్విస్ట్ మొదలైంది. వర్షం రావడంతో మ్యాచ్ ను అంపైర్లు నిలిపివేశారు. గ్రౌండ్ సిబ్బంది పిచ్ ను కవర్ చేస్తుండగా... ఇరు జట్ల ప్లేయర్స్ డగౌట్ కు చేరుకున్నారు. 10 నిమిషాల పాటు కురిసిన వాన అనంతరం నిలిచిపోయింది. కాసేపటికి మైదానంలోకి ఆటగాళ్లు వచ్చేశారు. క్రీజులో ఉన్న సఫారీ బ్యాటర్లు బ్రియాన్ మెక్ మిలన్, డేవిడ్ రిచర్డ్ సన్ టార్గెట్ ను కొట్టేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇంతలోనే పెద్ద ట్విస్ట్ సఫారీ జట్టును కనీసం పోరాడేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా చేసింది.

మైదానంలో ఉన్న స్క్రీన్ పై సౌతాఫ్రికా గెలవాలంటే 1 బంతికి 22 పరుగులు చేయాల్సిందిగా డిస్ ప్లే అయ్యింది. అంతే క్రీజులో ఉన్న సఫారీ బ్యాటర్లు ఏం  చేయకుండా అదొక్క బంతిని ఎదుర్కొని పెవిలియన్ బాట పట్టారు. పాపం అంపైర్లు తీసుకున్న తెలివి తక్కువ నిర్ణయంతో సౌతాఫ్రికా సెమీస్ నుంచి ఇంటి దారి పట్టాల్సి వచ్చింది. 10 నిమిషాల వర్షానికి 12 బంతుల కొత విధించిన అంపైర్లు ఒక్క పరుగు కూడా తగ్గించకపోవడంపై అప్పట్లో పెద్ద దుమారమే లేచింది.  అప్పట్లో ఉన్న వర్షం నిబంధనలపై క్రికెట్ అభిమానులతో పాటు విశ్లేషకులు కూడా దుమ్మెత్తి పోశారు. దాంతో ఆ నిబంధనను  ఐసీసీ తొలగించింది.  1997 నుంచి డక్ వర్త్ లూయిస్ పద్ధతిని ఇంట్రడ్యూస్ చేసింది.  ఈ మ్యాచ్ సరిగ్గా మార్చి 22 1992న జరగ్గా.. ఇప్పటికి 3 దశాబ్దాలను పూర్తి చేసుకుంది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Australia, Bangladesh, England, Pakistan, South Africa, World cup

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు