Worldcup 2019: బంగ్లా సంచలన విజయం... సఫారీ జట్టుకు షాక్ ఇచ్చిన పసికూన...

21 పరుగుల తేడాతో బంగ్లా అద్భుత విజయం... పోరాడిన డుమిని, మక్రమ్, డుప్లిసిస్... ముష్ఫికర్ రహీమ్‌కు 3 వికెట్లు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: June 2, 2019, 11:14 PM IST
Worldcup 2019: బంగ్లా సంచలన విజయం... సఫారీ జట్టుకు షాక్ ఇచ్చిన పసికూన...
బంగ్లా బౌలర్ సైఫుద్దీన్...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: June 2, 2019, 11:14 PM IST
Live Cricket Score, Bangladesh vs South Africa, ICC World Cup 2019 Match at Oval: వరల్డ్‌కప్‌లో భాగంగా సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పసికూనగా బరిలో దిగిన బంగ్లా సంచలనం క్రియేట్ చేసింది. పటిష్ట దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించి... సంచలన విజయంతో ప్రపంచకప్ టోర్నీని ఆరంభించింది. 331 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన సౌతాఫ్రికా... నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 309 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు డికాక్, మక్రమ్ నిలకడగా బ్యాటింగ్ చేయడంతో 9.4 ఓవర్లలో 49 పరుగులు రాబట్టింది సౌతాఫ్రికా జట్టు. ఈ దశలో 23 పరుగులు చేసిన డి కాక్ రనౌట్ కావడంతో సఫారీలకు తొలి షాక్ తగిలింది. ఆ తర్వాత డుప్లిసిస్, మక్రమ్ కలిసి రెండో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. అయితే 45 పరుగులు చేసిన మక్రమ్‌ను షకీబ్ ఉల్ హసన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత 62 పరుగులు చేసిన డుప్లిసిస్ కూడా మెహిడీ హసన్ బౌలింగ్‌లో బౌల్డ్‌ కావడంతో సఫారీ జట్టకు కష్టాలు మొదలయ్యాయి. డేవిడ్ మిల్లర్ 38 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అప్పటికి సఫారీ జట్టు విజయానికి 89 బంతుల్లో 129 పరుగులు కావాలి. ఆ తర్వాతి ఓవర్‌లో 3 పరుగులు మాత్రమే వచ్చాయి. ముస్తఫిజుర్ బౌలింగ్‌లో డుమిని అవుట్‌ అయినట్టు అంపైర్ ప్రకటించినా రివ్యూకి వెళ్లడంతో ఫలితం అతనికి అనుకూలంగా వచ్చింది. అదే ఓవర్‌లో ఫోర్, సిక్స్‌తో 15 పరుగులు రాబట్టాడు దుస్సెన్. అయితే 38 బంతుల్లో 41 పరుగులు చేసిన దుస్సెన్‌ను బౌల్డ్ చేసిన సైఫుద్దీన్ సఫారీలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత ఫెల్కుక్వాయో 8, క్రిస్ మోరిస్ 10 పరుగులు చేసి అవుటైనా, డుమిని పోరాటం చేశాడు. 37 బంతుల్లో 45 పరుగులు చేసిన డుమిని అవుట్ కావడంతో సఫారీ జట్టు ఓటమి ఖాయమైంది. చివరి ఓవర్లో 33 పరుగులు చేయాల్సి ఉండగా రబాడా, ఇమ్రాన్ తాహీర్ కలిసి 11 పరుగుల మాత్రమే రాబట్టగలిగారు. దాంతో బంగ్లాదేశ్ జట్టుకు 21 పరుగుల విజయం దక్కింది.


అంతుకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 330 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు ఆరంభం నుంచి ధాటిగా బ్యాటింగ్ చేయడంతో 8.2 ఓవర్లలోనే 60 పరుగులు సాధించింది బంగ్లా జట్టు. అయితే ఈ దశలో 16 పరుగులు చేసిన తమీమ్ ఇక్బాల్‌ను అవుట్ చేసిన ఫెల్కుక్వాయో... సఫారీలకు తొలి బ్రేక్ అందించాడు. ఆ తర్వాత 30 బంతుల్లో 9 ఫోర్లతో 42 పరుగులు చేసిన సౌమ్యా సర్కార్... క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన ముస్ఫికర్ రహీమ్‌తో కలిసి అద్భుత భాగస్వామ్యం నెలకొల్పారు షకీబ్ ఉల్ హసన్. ఇద్దరూ నిలకడగా ఆడుతూ అవకాశం దొరికినప్పుడల్లా బౌండరీలు బాదుతూ... స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. మూడో వికెట్‌కు 142 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత షకీబ్ ఉల్ హసన్ అవుట్ అయ్యాడు. 84 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్స్‌తో 75 పరుగులు చేసిన షకీబ్ ఉల్ హసన్‌ను ఇమ్రాన్ తాహీర్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత 21 పరుగులు చేసిన మహ్మద్ మిథున్ కూడా తాహీర్ బౌలింగ్‌లోనే బౌల్డ్ అయ్యాడు. 80 బంతుల్లో 8 ఫోర్లతో 78 పరుగులు చేసిన ముస్ఫికర్ రహీమ్... జట్టు 250 పరుగుల వద్ద అవుటై పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మొహ్మద్దుల్లా, మొసాడిక్ హుస్సేన్ కలిసి దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.
ban vs sa, sa v ban, world cup 2019, world cup, cricket 2019, world cup cricket 2019, world cup cricket, world cup 2019 team, icc, india world cup 2019, icc 2019 world cup, icc world cup, world cup schedule, 2019 world cup schedule, 2019 world cup squad, world cup 2019 list, india world cup team 2019, 2019 world cup, indian team, 2019 world cup teams, Live Cricket Streaming, icc cricket world cup live, Cricket World Cup Tournament, Live cricket score, Cricket news, Cricket updates, Hotstar live, sa vs ban,sa vs ban dream11,ban vs sa,sa vs ban dream11 team,ban vs sa dream11,sa vs ban match prediction,ban vs sa dream11 team,south africa vs bangladesh,sa vs ban world cup 2019,sa vs ban 2019,sa vs ban wc 2019,sa vs ban 5th match,sa vs ban playing xi,ban vs sa match prediction,sa vs ban live,cwc 2019 sa vs ban,sa vs ban dream 11,sa vs ban world cup,సౌతాఫ్రికా vs బంగ్లాదేశ్, వరల్డ్‌కప్ లైవ్ స్కోర్ 2019, క్రికెట్ వరల్డ్‌కప్ 2019
షకీబ్ ఉల్ హసన్ బ్యాటింగ్ (Photo by Ian KINGTON / AFP)


ఆరో వికెట్‌కు 66 పరుగులు జోడించిన తర్వాత 26 పరుగులు చేసిన హుస్సేన్ అవుట్ అయ్యాడు. అయితే చివరి ఓవర్లో మొహ్మద్దుల్లా, మెహిడీ హసన్ 14 పరుగులు రాబట్టడంతో బంగ్లా భారీ స్కోరు సాధించింది. మొహ్మద్దుల్లా 33 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్స్‌తో 46 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. బంగ్లాదేశ్‌కు వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. సౌతాఫ్రికా స్టార్ బౌలర్ ఇంగిడి గాయం కారణంగా నాలుగు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి పెవిలియన చేరడం ఆ జట్టును బాగా ప్రభావితం చేసింది. ఫెల్కుక్వాయో, ఇమ్రాన్ తాహీర్, క్రిస్ మోరిస్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.


First published: June 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...