SOUTH AFRICA STAR ALL ROUNDER CHRIS MORRIS ANNOUNCES RETIREMENT FOR ALL FORMATS OF CRICKET SRD
Chris Morris : ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన స్టార్ ఆల్ రౌండర్ సంచలన నిర్ణయం..
Chris Morris
Chris Morris : ఐపీఎల్ 2021 వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ.16.25 కోట్ల భారీ మొత్తానికి క్రిస్ మోరిస్‌ను దక్కించుకుంది. 2015 ఐపీఎల్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి రూ.16 కోట్లు అందుకున్న యువరాజ్ సింగ్ రికార్డును అధిగమించాడు క్రిస్ మోరిస్.
సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ (Chris Morris) షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ (International Cricket)కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. 2012లో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు క్రిస్ మోరిస్. ఈ మేరకు... " అన్ని రకాల ఫార్మాట్ల నుంచి నేను రిటైర్ అవుతున్నాను. నా ప్రయాణంలో నాకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. టైటాన్‌కు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాను " అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. దేశవాళీ టీ20 జట్టుకు కోచ్‌గా పగ్గాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నాడు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా క్రిస్ మోరిస్ రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2021 మినీ వేలంలో భాగంగా జట్టు అతడిని 16.5 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో మెగా వేలానికి ముందు మోరిస్ ఈ మేరకు ప్రకటన చేయడం గమనార్హం.
అయితే, 2013లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు క్రిస్ మోరిస్. ఆ తర్వాత మూడేళ్లకు ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు మ్యాచ్‌తో ఎంట్రీ ఇచ్చాడు. మొత్తంగా క్రిస్ మోరిస్ దక్షిణాఫ్రికా తరఫున 4 టెస్టులు, 42 వన్డేలు, 23 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2019లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.
ఇక ఐపీఎల్ కెరీర్ విషయానికొస్తే 81 మ్యాచ్‌లు ఆడిన క్రిస్ మోరిస్ 618 పరుగులు చేశాడు. 95 వికెట్లు పడగొట్టాడు. గత సీజన్లో రాజస్తాన్ తరఫున 11 మ్యాచ్‌లు ఆడి 67 పరుగులు చేయడంతో పాటుగా... 15 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. సౌతాఫ్రికా దేశవాళీ ఫ్రాంఛైజీ టైటాన్స్ తరుపున ఫస్ట్ క్లాస్, లిస్టు ఏ క్రికెట్ ఆడిన క్రిస్ మోరిస్... 105 లిస్టు ఏ మ్యాచులు, 59 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్లో 4 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలతో 2535 పరుగులు చేసిన మోరిస్, 196 వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడిన క్రిస్ మోరిస్... రెండోసారి రాజస్థాన్ తరుపున ఆడి క్రికెట్‌కి వీడ్కోలు పలికాడు. ఐపీఎల్ చరిత్రలో వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న క్రికెటర్‌గా క్రిస్ మోరిస్ రికార్డు క్రియేట్ చేశాడు. ఐపీఎల్ 2021 వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ.16.25 కోట్ల భారీ మొత్తానికి క్రిస్ మోరిస్‌ను దక్కించుకుంది. 2015 ఐపీఎల్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి రూ.16 కోట్లు అందుకున్న యువరాజ్ సింగ్ రికార్డును అధిగమించాడు క్రిస్ మోరిస్.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.