హోమ్ /వార్తలు /క్రీడలు /

T20 World Cup 2022 : టి20 ప్రపంచకప్ కోసం జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా.. జట్టులో హార్డ్ హిట్టర్.. ప్రత్యర్థులకు ఇక దడే

T20 World Cup 2022 : టి20 ప్రపంచకప్ కోసం జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా.. జట్టులో హార్డ్ హిట్టర్.. ప్రత్యర్థులకు ఇక దడే

PC : TWITTER

PC : TWITTER

T20 World Cup 2022 : టి20 ప్రపంచకప్ (T20 World Cup) ఆరంభానికి 6 వారాల కంటే కూడా తక్కువ సమయం ఉంది. అక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియా (Australia) వేదికగా టి20 ప్రపంచకప్ మహా సంగ్రామం ఆరంభం కానుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

T20 World Cup 2022 : టి20 ప్రపంచకప్ (T20 World Cup) ఆరంభానికి 6 వారాల కంటే కూడా తక్కువ సమయం ఉంది. అక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియా (Australia) వేదికగా టి20 ప్రపంచకప్ మహా సంగ్రామం ఆరంభం కానుంది. సెప్టెంబర్ 15వ తేదీలోపు టి20 ప్రపంచకప్ జట్లను ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే ఇంగ్లండ్ (England), ఆస్ట్రేలియా (Australia) జట్లు టి20 ప్రపంచకప్ కోసం జట్లను ప్రకటించాయి. తాజాగా ఈ జాబితాలోకి దక్షిణాఫ్రికా (South Africa) కూడా చేరింది మంగళవారం 15 మంది సభ్యులతో క్రికెట్ సౌతాఫ్రికా (CSA) టి20 ప్రపంచకప్ కోసం జట్టును ప్రకటించింది. బవుమా ()ను కెప్టెన్ గా నియమించింది. అయితే గాయంతో స్టార్ ప్లేయర్ రస్సీ వాన్ డెర్ డుస్సెన్ టి20 ప్రపంచకప్ నుంచి తప్పుకున్నాడు. ముంబై ఇండియన్స్ ప్లేయర్ ట్రిస్టన్ స్టబ్స్ కు జట్టులో చోటు దక్కడం విశేషం.

జట్టు ఎలా ఉందంటే?

క్వింటన్ డికాక్, మార్కరమ్, హ్రెన్రిచ్ క్లాసెన్, రీజా హెండ్రింక్స్, బవూమా, మిల్లర్, స్టబ్స్, రూసోవ్ లను బ్యాటర్లుగా తీసుకుంది. బౌలర్లుగా నోకియా , కగిసో రబడ, షమ్సీ, ఎంగిడి, కేశవ్ మహరాజ్ ఉండనున్నారు. ఆల్ రౌండర్ల జాబితాలో వేన్ పార్నెల్, ప్రిటోరియస్ లను ఎంపిక చేసింది. మార్కో యాన్సెన్, పెకుల్వాయో, ఫోర్టున్ లను రిజర్వ్ ప్లేయర్ లు గా ఎంపిక చేసింది. టీంను చూస్తే ఆల్ రౌండర్లను పెద్దగా సెలెక్ట్ చేయలేదనే చెప్పాలి.  కేవలం పార్నెల్, ప్రిటోరియస్ లు మాత్రమే బౌలింగ్, బ్యాటింగ్ చేయగలరు. మార్కరమ్ కు కొన్ని ఓవర్లు వేసే సత్తా ఉన్నా అతడిని పార్ట్ టైమ్ బౌలర్ గా పరిగణిస్తామే తప్ప ఆల్ రౌండర్ గా పరిగణించడం కష్టం.

South Africa Squad for t20i world cup, South Africa T20I World Cup Squad, T20I World Cup Squads, Australia T20I World Cup Squad, England T20I World Cup Squad, India T20I World Cup Squad, New Zealand T20I World Cup Squad, sri Lanka T20I World Cup Squad, IND vs SL Toss, India vs Sri Lanka Toss, Asia Cup 2022, IND vs SL Match Updates, India vs Sri Lanka match preview predicted playing xi pitch report head to head, India vs Sri Lanka Live Scores, India vs Sri Lanka playing xi, India vs Sri Lanka predicted playing XI, India vs Sri Lanka Asia cup Squads, India vs Sri Lanka Scorecard, India vs Sri Lanka Toss, India vs Sri Lanka dream Xi, India vs Sri Lanka my Dream Xi, India vs Sri Lanka Head to Head in T20I, Dasun Shanka, Bhannuka Rajapaksa, Gunatilaka, Virat Kohli, Rohit sharma, Suryakumar Yadav, Deepak Hooda, టి20 ప్రపంచకప్ 2022, టి20 ప్రపంచకప్ జట్ల వివరాలు, దక్షిణాఫ్రికా టి20 ప్రపంచకప్ స్క్వాడ్, వీరేంద్ర సెహ్వాగ్, ఆసియా కప్ 2022 టైటిల్ నెగ్గే జట్టు ఏదో చెప్పేసిన సెహ్వాగ్, ఆసియా కప్ 2022 విజేత ఎవరంటే?, ఆసియా కప్ 2022 విజేత ఎవరో చెప్పేసిన సెహ్వాగ్, ఇండియా వర్సెస్ శ్రీలంక, ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్, స్పోర్ట్స్ న్యూస్, క్రీడా వార్తలు, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, దసున్ షనక, భానుక రాజపక్స

ఈ మధ్య కాలంలో సౌతాఫ్రికా టి20ల్లో అద్భుత విజయాలను సాధిస్తోంది. ఇంగ్లండ్ ను వారి గడ్డపైనే ఓడించింది. ఆ తర్వాత ఐర్లాండ్ పై కూడా సిరీస్ నెగ్గింది. మిల్లర్, స్టబ్స్ రూపంలో సౌతాఫ్రికాలో భారీ హిట్టర్లు ఉన్నారు. అదే సమయంలో మార్కరమ్, క్లాసెన్, బవూమా రూపంలో నమ్మదిగిన బ్యాటర్లు ఉన్నారు. అయితే డికాక్ ఫామే సౌతాఫ్రికాను కలవర పెడుతుంది. డికాక్ కూడా ఫామ్ లోకి వస్తే టి20 ప్రపంచకప్ లో సంచలనాలు నమోదు చేసే అవకాశం ఉంది. టి20 ప్రపంచకప్ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు జరగనుంది.

సౌతాఫ్రికా టీం

తెంబా బవుమా (కెప్టెన్), క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, క్లాసెన్, మార్కరమ్, మిల్లర్, స్టబ్స్, రొసౌ, నోకియా, కగిసో రబడ, షమ్సీ, ఎంగిడి, కేశవ్ మహరాజ్, పార్నెల్, ప్రిటోరియస్

స్టాండ్ బై

మార్కో యాన్సెన్, పెకుల్వాయో,  ఫోర్టున్

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Australia, England, India vs srilanka, Rohit sharma, South Africa, T20 World Cup 2022, Virat kohli, World cup

ఉత్తమ కథలు