హోమ్ /వార్తలు /క్రీడలు /

షాకింగ్ నిర్ణయం.. దక్షిణాఫ్రికా క్రికెట్‌పై నిషేధం!

షాకింగ్ నిర్ణయం.. దక్షిణాఫ్రికా క్రికెట్‌పై నిషేధం!

Team: SOUTH AFRICA Rank: 5 Points:3345 Mathes:31 Ratings:108

Team: SOUTH AFRICA Rank: 5 Points:3345 Mathes:31 Ratings:108

ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటు సతమతమవుతున్న దక్షిణాఫ్రికా క్రికెట్‌ (సీఎస్‌ఏ) మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇక బోర్డు వ్వవహారాల్లో తమ జోక్యం చేసుకోనున్నట్టు అక్కడి ప్రభుత్వం అధికారంగా ప్రకటించింది.

  ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటు సతమతమవుతున్న దక్షిణాఫ్రికా క్రికెట్‌ (సీఎస్‌ఏ) మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇక బోర్డు వ్వవహారాల్లో తమ జోక్యం చేసుకోనున్నట్టు అక్కడి ప్రభుత్వం అధికారంగా ప్రకటించింది. ఈ మేరకు క్రీడా మంత్రి నాతి మెథ్వీ ఓ ప్రకటన విడుదల చేశారు.

  తీరు మార్చుకోవాలని దక్షిణాఫ్రికా క్రికెట్‌ (సీఎస్‌ఏ)కు పలుమార్లు అదేశించనప్పటికి బోర్డు సభ్యుల తీరులో ఎలాంటి మార్పు రాలేదని నాతి మెథ్వీ తెలిపారు. "సీఎస్‌ఏ పాలన పరమైన నిర్ణయాలలో జరుగుతున్న పొరపాట్లును సరిదిద్దుకోవాలని పలు మార్లు సూచించాం. కానీ వారిలో ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో ఈ నిర్ణయానికి తీసుకున్నాం. ఇక ఆ సభ్యులతో ఎలాంటి చర్చలు ఉండవని" తెలిపారు

  గతంలోనే బోర్డు నిషేధంపై వార్తలు వచ్చినప్పటికి.. తాజా ప్రకటనతో ప్రభుత్వం బోర్డు స్వాధినానికి చర్యలు చేపట్టింది.  ఎందుకు బోర్డు విషయంలో జోక్యం చేసుకోకూడదో తెలిపేలా వివరణ ఇవ్వాలని దక్షిణాఫ్రికా క్రికెట్‌ అధికారులకు మెథ్వీ అక్టోబర్‌ 27 వరకు సమయం ఇచ్చారు. బోర్డులో నెలకొన్ని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పలుమార్లు ప్రయత్నించనప్పటికి సీఎస్‌ఏ సరైనా విధంగా సహకరించలేదని అందువల్లే పూర్తి స్ధాయి చర్యలకు క్రీడాశాఖ దిగిందని  నాతి మెథ్వీ వెల్లడించారు.

  క్రికెట్ బోర్డు వ్వవహారాల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదు

  ఐసీసీ నిబంధనల ప్రకారం దేశాల క్రికెట్‌ బోర్డు వ్వవహారాల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదు. ఒక్కవేళ ప్రభుత్వాలు బోర్డు విషయంలో కలగజేసుకుంటే ఆ సంఘాన్ని అంతర్జాతీయ జరిగే ఈవెంట్స్ నుంచి బహిష్కరిస్తుంది. ఇక సఫారీ విషయంలో ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

  Published by:Rekulapally Saichand
  First published:

  ఉత్తమ కథలు