సౌతాఫ్రికా ఆటతీరుపై క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్...ఇంత చెత్త బ్యాటింగా అంటూ సఫారీలపై కన్నెర్ర...

జట్టు బ్యాటింగ్ చాలా చెత్తగా ఉందని, ఒక్కరూ కూడా జట్టుకు అండగా నిలువక పోవడం బాధాకరమని వాపోయారు. జట్టును ముందుండి నడిపించాల్సిన సీనియర్లు పేలవమైన ఆటతో నిరాశే మిగుల్చుతున్నారని విమర్శించారు.

news18-telugu
Updated: October 22, 2019, 10:55 PM IST
సౌతాఫ్రికా ఆటతీరుపై క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్...ఇంత చెత్త బ్యాటింగా అంటూ సఫారీలపై కన్నెర్ర...
(Image : Cricketnext )
  • Share this:
ఇండియాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో సౌతాఫ్రికా క్రికెటర్ల పేలవమైన ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో జట్టు ఆటపై వారు సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ప్రపంచ క్రికెట్‌ను శాసించిన సౌతాఫ్రికా ఇలా చెత్తగా ఆడడం ఏంటని క్రికెట్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. భారత పర్యటనలో కెప్టెన్ డుప్లెసిస్ ఘోరంగా విఫలమయ్యాడని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. కనీస పోటీ ఇవ్వకుండానే చేతులెత్తేయడాన్ని సౌతాఫ్రికా క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇలాంటి ఆటతో ఏ జట్టునైనా ఎదుర్కొవడం కష్టమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జట్టు బ్యాటింగ్ చాలా చెత్తగా ఉందని, ఒక్కరూ కూడా జట్టుకు అండగా నిలువక పోవడం బాధాకరమని వాపోయారు. జట్టును ముందుండి నడిపించాల్సిన సీనియర్లు పేలవమైన ఆటతో నిరాశే మిగుల్చుతున్నారని విమర్శించారు. కాగా ముందెప్పుడు కూడా ఇంత చెత్తగా ఆడలేదని, కానీ ఈసారి భారత పర్యటనలో తమ జట్టు ఘోరంగా విఫలమైందని సౌతాఫ్రికా అభిమానులు బాధ వెళ్లగక్కుతున్నారు.
Published by: Krishna Adithya
First published: October 22, 2019, 10:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading