India vs South Africa: మూడో రోజు ముగిసిన విశాఖ టెస్టు మ్యాచ్...సౌతాఫ్రికా స్కోరు 385/8

స్పినర్లు అశ్విన్, రవీంద్ర జడేజాలు వికెట్లు పడగొట్టడంలో సఫలమయ్యారు. స్పిన్నర్ అశ్విన్ 5 వికెట్లు పడగొట్టగా, జడేజా 2 వికెట్లు పడగొట్టాడు. సౌతాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్ (160), క్వింటన్ డికాక్ (111) సెంచరీలు చేయడం ఈ రోజు హైలైట్ గా చెప్పుకోవచ్చు.

Krishna Adithya | news18-telugu
Updated: October 4, 2019, 6:02 PM IST
India vs South Africa: మూడో రోజు ముగిసిన విశాఖ టెస్టు మ్యాచ్...సౌతాఫ్రికా స్కోరు 385/8
రవిచంద్రన్ అశ్విన్ (Image : Cricketnext)
Krishna Adithya | news18-telugu
Updated: October 4, 2019, 6:02 PM IST
విశాఖపట్నం వేదికగా జరుగుతున్న భారత్, సౌతాఫ్రికా టెస్టు క్రికెట్ మ్యాచ్ మూడో రోజు ముగిసింది. డే ముగిసే నాటికి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 385/8 పరుగులు చేసింది. క్రీజులో ముత్తుసామి (12), కేశవ్ మహరాజ్ (3)లు ఆడుతున్నారు. మూడో రోజు భారత బౌలర్లు సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ ను కట్టడి చేశారు. స్పినర్లు అశ్విన్, రవీంద్ర జడేజాలు వికెట్లు పడగొట్టడంలో సఫలమయ్యారు. స్పిన్నర్ అశ్విన్ 5 వికెట్లు పడగొట్టగా, జడేజా 2 వికెట్లు పడగొట్టాడు. సౌతాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్ (160), క్వింటన్ డికాక్ (111) సెంచరీలు చేయడం ఈ రోజు హైలైట్ గా చెప్పుకోవచ్చు. 53 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి మూడో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికీ ఓపెనర్ ఎల్గర్, డుప్లెసిస్ 5వ వికెట్‌కు 101 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో వికెట్ల పతనానికి అడ్డుకట్టవేసింది.

178 పరుగుల వద్ద డుప్లెసిస్ ఔట్ అయిన అనంతరం క్వింటన్ డికాక్ క్రీజులో నిలబడి సెంచరీ చేశాడు.  99.3 ఓవర్ వద్ద డీన్ ఎల్గర్ ఔట్ అయ్యాడు. అనంతరం కాసేపటికే క్వింటన్ డికాక్ సైతం 370 పరుగుల వద్ద ఏడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. దీంతో సౌతాఫ్రికా జట్టు కష్టాల్లో పడిందనే చెప్పవచ్చు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో విసిరిన 502 పరుగుల స్కోరును అధిగమించేందుకు సౌతాఫ్రికా ఇంకా 117 పరుగులు వెనుకబడి ఉంది.

 


First published: October 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...