Faf Du Plessis: డుప్లెసిస్‌కు మెమరీ లాస్.. ఏం గుర్తుకు లేదా? ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది?

డుప్లెసిస్

Faf Du plessis: తనకు మెమరీ లాస్ అని డుప్లెసిస్ ట్వీట్ చేయగానే నెటిజన్లు షాక్ తిన్నారు. అదేంటి ఏం గుర్తుకు లేదా? అని అడుతున్నారు. కనీసం మీ పేరైనా గుర్తుందా..? అని ప్రశ్నిస్తున్నారు.

 • Share this:
  పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) మ్యాచ్‌లో సౌతాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ ఫాప్ డుప్లెసిస్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుత తన ఆరోగ్యంపై అప్‌డేట్స్ వెల్లడించాడు డుప్లెసిస్. ఆస్పత్రి నుంచి తాను డిశ్చార్జి అయ్యి.. హోటల్‌కు చేరుకున్నానని చెప్పాడు. హోటల్‌లోనే రెస్ట్ తీసుకుంటూ కోలుకుంటున్నట్లు తెలిపాడు. ఐతే శనివారం జరిగిన ఘటనలో కంకషన్‌ (Concussion)కు గురయినట్లు వెల్లడించాడు డుప్లెసిస్. కంకషన్ అంటే తలకు ఏదైనా బలమైన గాయం తగిలిన తర్వాత ఏర్పడే తాత్కాలిక అచేతన, గందరగోళ పరిస్థితి. కొంత మెమరీ లాస్‌ కూడా ఉందని.. ఐనప్పటికీ అంతా సర్దుకుంటుందని పేర్కొన్నాడు. త్వరలోనే తిరిగి మైదానంలోకి అడుగుపెడతానని స్పష్టం చేశాడు డుప్లెసిస్.

  ''నేను కోలుకోవాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. హోటల్‌కు తిరిగొచ్చాక విశ్రాంతి తీసుకుంటున్నా. కంకషన్‌తో పాటు కొంత మెమరీ లాస్ కూడా ఉంది. కానీ ఏం ఇబ్బంది లేదు. త్వరలోనే పూర్తిగా కోలుకొని తిరిగి మైదానంలోకి అడుగుపెడతా.'' అని డుప్లెసిస్ ట్వీట్ చేశాడు.
  కాగా, తనకు మెమరీ లాస్ అని డుప్లెసిస్ ట్వీట్ చేయగానే నెటిజన్లు షాక్ తిన్నారు. అదేంటి ఏం గుర్తుకు లేదా? అని అడుతున్నారు. కనీసం మీ పేరైనా గుర్తుందా..? అని ప్రశ్నిస్తున్నారు. ఐతే తలకు బలమైన గాయం కావడంతో డుప్లెసిస్ కాస్త షాక్‌లో ఉన్నాడు. ఆయనకు కొంత గందరగోళంగా ఉంది. అంత మాత్రానికే ఏమీ గుర్తుండదని అనుకోడం కరెక్టుకాదని మరికొందు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే మళ్లీ బ్యాటింగ్‌తో మనందరినీ అలరిస్తాడని ట్వీట్స్ చేస్తున్నారు.

  శనివారం దుబాయ్ వేదికగా క్వెట్టా గ్లాడియేటర్స్‌, పెషావర్‌ జల్మి జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. సౌతాఫ్రికా ప్లేయర్ ఈ టోర్నీలో డుప్లెసిస్ క్వెటా టీమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. బౌండరీ లైన్ వద్ద బంతిని అడ్డుకునే క్రమంలో సహచర ఆటగాడైన మహమ్మద్‌ హస్‌నైన్‌ను బలంగా ఢీ కొట్టాడు. హస్‌నైన్‌ మోకాలి చిప్ప బలంగా డుప్లెసిస్ తలకు తాకడంతో కళ్లు తిరిగి పడిపోయాడు. కిందపడిపోయి అలాగే ఉండిపోయాడు. అతడిని చూసి గ్రౌండ్‌లో అందరూ ఆందోళన చెందారు. మెడికల్ టీమ్ హుటాహుటిన డుప్లెసిస్‌ను ఆస్పత్రికి తరలించారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  శుక్రవారం వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్‌ ఆండ్రే రసెల్‌ కూడా గాయపడ్డాడు. క్వెటా గ్లాడియేటర్స్‌, ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. సిక్సులతో విరుచుకుపడుతున్న రస్సెల్‌కు 14వ ఓవర్లో హమ్మద్ ముసా బౌలింగ్ చేశాడు. నాలుగో బంతిని షార్ట్ బాల్ వేయడంతో.. అది బౌన్స్ అయ్యి రస్సెల్ హెల్మెట్‌ను బలంగా తాకింది. తల పట్టేసినట్లు అనిపించడంతో.. అక్కడ కూర్చున్నాడు. అతడి పరిస్థితిని చూసిన మెడికల్ సిబ్బంది స్ట్రెచర్‌పై ఆస్పత్రికి తీసుకెళ్లారు.


  డుప్లెసిస్, రస్సెల్ ఇద్దరూ క్వెటా టీమ్‌లోనే ఆడుతున్నారు. వీరిద్దరు త్వరగా కోలుకోవాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. సెప్టెంబర్‌లో జరిగే ఐపీఎల్‌లో మళ్లీ బ్యాట్‌తో విజృంభించాలని ఆకాంక్షిస్తున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published: