గ్రౌండ్‌లో మ్యాజిక్ చేసిన బౌలర్.. బాల్‌తో కాదు స్టిక్‌తో..

తన ట్రిక్ ఉపయోగించి వస్త్రాన్ని స్టిక్‌గా మార్చడంతో.. స్టేడియంలో ఉన్న వాళ్లంతా ఈలలు, చప్పట్లతో అభినందించారు.

news18-telugu
Updated: December 5, 2019, 7:43 PM IST
గ్రౌండ్‌లో మ్యాజిక్ చేసిన బౌలర్.. బాల్‌తో కాదు స్టిక్‌తో..
తజ్రేజ్ షంసి మ్యాజిక్
  • Share this:
బ్యాట్స్‌మెన్ వికెట్ పడితే బౌలర్ల సంతోషానికి అవధులు ఉండవు. వికెట్ పడిన ఊపులో గాల్లోకి ఎగిరి గంతేసి సెలబ్రేట్ చేసుకుంటారు. తమ విచిత్ర హావభావాలతో ప్రేక్షకులను అలరిస్తారు. కొందరు గ్రౌండ్ అంతా తిరిగి సందడి చేస్తే.. ఇంకొందరు మాత్రం ఇంకాస్త వెరైటీగా చేస్తారు. సౌతాఫ్రికా బౌలర్ తబ్రేజ్ షంసీ కూడా ఇలాంటి కోవలోకే వస్తాడు. అందరిలా కాకుండా గ్రౌండ్‌లో మ్యాజిక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రొఫెషనల్ మెజీషియన్‌లా అద్భుతం చేసి ఔరా.. అనిపించాడు.

బుధవారం మ్జాన్సీ సూపర్ లీగ్‌లో భాగంగా పార్ల్‌రాక్స్, డర్బన్ హీట్ జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో పార్ల్‌రాక్స్ బౌలర్ తబ్రేజ్ షంసీ.. డర్బన్ హీట్ బ్యాట్స్‌మెన్ వికెట్ తీశాడు. వికెట్ తీసిన ఆనందాన్ని వెరైటీగా సెలబ్రేట్ చేసుకున్నాడు తబ్ర్రేజ్. తన ఎడమ చేతిలో ఉన్న వస్త్రంతో గ్రౌండ్‌లోనే మ్యాజిక్ చేశాడు. తన ట్రిక్ ఉపయోగించి వస్త్రాన్ని స్టిక్‌గా మార్చడంతో.. స్టేడియంలో ఉన్న వాళ్లంతా ఈలలు, చప్పట్లతో అభినందించారు. తబ్రేజ్ ఇలా చేయడం తొలిసారి కాదు. గత నెలలో జరిగిన ఓ మ్యాచ్‌లోనూ ఇలాంటి మ్యాజిక్కే చేశాడు.


First published: December 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>