SOUTH AFRICA BEATS INDIA IN SECOND ODI WON THE THREE ODI SERIES WITH CONSECUTIVE VICTORIES AK
IND vs SA : రెండో వన్డేలో దక్షిణాఫ్రికా విజయం.. మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ కైవసం
దక్షిణాఫ్రికా జట్టు (ఫైల్ ఫోటో)
IND vs SA : టార్గెట్ ఛేజింగ్లో దక్షిణాఫ్రికా అదరగొట్టింది. సఫారీ టీమ్ ఓపెనర్లు మంచి శుభారంభం అందించగా.. మిడల్ ఆర్డర్ ఏ మాత్రం తడబడకుండా విక్టరీ దిశగా జట్టును నడిపించింది.
దక్షిణాఫ్రికా టూర్లో భారత్కు చేదు అనుభవాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మూడు టెస్టుల సిరీస్ను కోల్పోయిన టీమిండియా.. తాజాగా వన్డే సిరీస్ను కూడా అతిథ్య జట్టుకు అప్పగించింది. మూడు వన్డేల సిరీస్లో మరో వన్డే మిగిలి ఉండగానే.. దక్షిణాఫ్రికా జట్టు సిరీస్ను సొంతం చేసుకుంది. రెండో వన్డేలో భారత్ తమ ముందు ఉంచిన 287 పరుగుల లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు కోల్పోయి మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే చేధించింది సఫారీ జట్టు. అలా టీమిండియాను టెస్టు, వన్డే సిరీస్లో ఓడించి సొంతగడ్డపై తమకు తిరుగులేదని నిరూపించింది. రెండో వన్డేలో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు వచ్చిన టీమిండియా బ్యాట్స్’మెన్ కేఎల్ రాహుల్ (55), రిషభ్ పంత్ (85) అర్ధ సెంచరీలతో రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 287 పరుగులు సాధించి ప్రత్యర్థికి సవాలు విసిరింది. మొదట్లో ఓపెనర్లు కెఎల్ రాహుల్ (55) తో పాటు శిఖర్ ధావన్ (29) రాణించారు. దీంతో మొదటి వికెట్ కు 63 పరుగుల భాగాస్వామ్యం దక్కింది. ఫస్ట్ డౌన్ కోహ్లి (0) డకౌట్ తో నిరాశ పరిచాడు.
కానీ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 71 బంతుల్లో 85 పరుగులు చేశాడు. 10 ఫోర్లు, 2 సిక్స్ లను బాదాడు. దీంతో నాలుగో వికెట్ కు 115 పరుగుల భారీ భాగస్వామ్యం టీమిండియాకు దక్కింది. శ్రేయస్ అయ్యార్ నిరాశ పరిచినా.. వెంకటేష్ అయ్యార్ (22) పర్వలేదని అనిపించాడు. కాగ చివర్లో శార్ధూల్ ఠాకూర్ (40) తో పాటు రవి చంద్రన్ అశ్విన్ (25) పరుగులు చేశారు. దీంతో టీమిండియా నిర్ణిత 50 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 287 పరుగులు చేసింది.
అనంతరం టార్గెట్ ఛేజింగ్ కోసం రంగంలోకి దిగిన సఫారీ బ్యాట్స్మెన్ ఏ దశలో తడబడలేదు. ఓపెనర్లు మలన్, డికాక్ వికెట్ నష్టపోకుండా జట్టు స్కోరును 100 పరుగులు దాటించారు. 78 పరుగులు చేసిన అనంతరం డికాక్ ఔటయ్యాడు. అయితే మలన్ ఓపిగ్గా బ్యాటింగ్ చేసి 91 పరుగులు సాధించాడు. వీరిద్దరూ ఔటయిన తరువాత వచ్చిన బవుమా 35 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ తరువాత మర్క్రం, డుస్సెన్ మరో వికెట్ పడకుంగా జట్టును విజయతీరాలకు చేర్చారు. భారత్ బౌలర్లు బుమ్రా, చాహల్, శార్దూల్ చెరో వికెట్ తీశారు.
మరో వన్డే మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ను కైవసం చేసుకోవడంతో రెండు జట్ల మధ్య జరగబోయే మూడో వన్డే నామమాత్రంగా మారిపోయింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.