బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా సౌరవ్‌ గంగూలీ... దాదాపు ఖరారు

BCCI President : క్రికెట్ లోనే కాదు... వ్యవహారాలు నడపడంలో... పదవుల్ని పొందడంలో సౌరవ్ గంగూలీ ఎంతో నేర్పరి. తెరవెనక తెలివిగా పావులు కదిపిన దాదా... కీలక పదవిని దక్కించుకోబోతున్నట్లు తెలిసింది.

news18-telugu
Updated: October 14, 2019, 8:20 AM IST
బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా సౌరవ్‌ గంగూలీ... దాదాపు ఖరారు
గంగూలీ (File)
  • Share this:
Sourav Ganguly : బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రాబోతున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి ఆయన ఎన్నిక దాదాపు ఫైనలైనట్లే. హోంమంత్రి అమిత్‌ షా కొడుకు జై షా... కార్యదర్శిగా, బోర్డు మాజీ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌కు తమ్ముడైన అరుణ్‌ ధూమల్‌... ట్రెజరీగా ఎన్నికవుతున్నట్లు సమాచారం. 47 ఏళ్ల గంగూలీ ఇప్పుడు బంగాల్‌ క్రికెట్‌ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్నాడు. బీసీసీఐ అధ్యక్షుడైతే... రూల్ ప్రకారం 2020 సెప్టెంబరులో ఆ పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. ఐతే... BCCI ప్రతినిధులు... సంస్థ కీలక పదవుల్లో ఎవర్ని ఉంచాలో చర్చించుకున్నారు. గంగూలీ, బ్రిజేష్‌ పటేల్‌... ఇద్దరిలో ఒకర్ని అధ్యక్షుడిగా ఉంచాలని అనుకున్నారు. బ్రిజేష్‌కి అధ్యక్ష పదవి ఇచ్చి... గంగూలీని IPL ఛైర్మన్‌ చెయ్యాలనుకున్నారు. అందుకు గంగూలీ ఒప్పుకోకపోవడంతో... దాదాకే అధ్యక్ష పదవి ఇచ్చి... బ్రిజేష్‌ని ఐపీఎల్ ఛైర్మన్‌ని చేద్దామని అనుకున్నారు. ఐతే... బ్రిజేష్ మాత్రం తననే ప్రెసిడెంట్ చెయ్యాలని పట్టుపడుతున్నారు. దీనిపై ఇవాళ క్లారిటీ రానుంది. అక్టోబర్ 23న బీసీసీఐ ఎన్నికలు జరుగుతాయి.

బీసీసీఐ కీలక పదవుల్ని పోటీలేకుండా దక్కించుకునేందుకు రాజకీయ వర్గాలు, క్రికెట్ పెద్దలు కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం జరిగిన సమావేశం కీలకంగా మారింది. నామినేషన్లకు ఇవాళే చివరి తేదీ కావడంతో... పోటీ ప్రధానంగా గంగూలీ, బ్రిజేష్ మధ్యే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్రిజేష్ పటేల్‌కి శ్రీనివాసన్ వర్గం సపోర్ట్ ఉండగా... గంగూలీకి అమిత్ షా సపోర్ట్ కనిపిస్తోంది. ఓవరాల్‌గా చూస్తే... గంగూలీకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

Pics : క్యూట్‌గా కవ్విస్తున్న కోల్‌కతా బ్యూటీ అంబాలికా
ఇవి కూడా చదవండి :

ఏపీలో 1,448 ఆలయాల్లో పాలక మండళ్ల భర్తీ... నోటిఫికేషన్లు జారీఉత్తమ్‌‌కుమార్‌కి ఉద్వాసన... హుజూర్‌నగర్ ఎన్నిక తర్వాతే ముహూర్తం

ఇంకెంతమంది చనిపోవాలి... సీఎం కేసీఆర్‌పై భగ్గుమంటున్న ఆర్టీసీ కార్మికులు

ఆర్టీసీ సమ్మె తీవ్రతరం... నేడు డిపోల ముందు బైఠాయింపు... ఖమ్మంలో బంద్

సీఎం కేసీఆర్‌కి ఝలక్... నేడు కొన్ని ప్రైవేట్ స్కూళ్లు ఓపెన్
First published: October 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading