దాదాకు దీదీ అభినందనలు...గంగూలీకి మమతా బెనర్జీ సర్ ప్రైజ్

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అభినందనలు తెలియజేశారు.

news18-telugu
Updated: October 14, 2019, 10:02 PM IST
దాదాకు దీదీ అభినందనలు...గంగూలీకి మమతా బెనర్జీ సర్ ప్రైజ్
దాదాకు దీదీ అభినందనలు
news18-telugu
Updated: October 14, 2019, 10:02 PM IST
బిసిసిఐ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కాబోయే టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అభినందనలు తెలియజేశారు. బిసిసిఐ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్న సౌరవ్ గంగూలీకి అభినందనలు. మీరు భారత్‌ను, బెంగాల్‌ను గర్వించేలా చేశారు. బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా మీరు అందించిన సేవలు గర్వకారణం. కొత్త ఇన్నింగ్స్‌లో మీరు దూసుకుపోవాలని ఆశిస్తున్నాం’ అని మమత బెనర్జీ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే బిసిసిఐ అధ్యక్ష పదవికి రేసులో గంగూలీ సోమవారం నామినేషన్ వేశాడు. గంగూలీతో పాటుగా బిసిసిఐ కార్యదర్శి పదవికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు జైషా నామినేషన్ వేయగా.. కోశాధికారిగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సోదరుడు అరుణ్ ధుమాల్ నామినేషన్ వేశాడు. అయితే, అధ్యక్ష పదవికి గంగూలీ తప్ప మరెవ్వరూ నామినేషన్ వేయకపోవడంతో ఆయన ఎన్నిక లాంఛనప్రాయం కానుంది. ఈ నెల 23న బిసిసిఐ ఎన్నికలు జరగనున్నాయి.

 First published: October 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...