ICC World Cup 2019: వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్‌కు వచ్చే 4 జట్లు ఇవే అంటున్న గంగూలీ

2003 ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారతజట్టుకు సౌరవ్ గంగూలీ సారధ్యం వహించాడు.

news18-telugu
Updated: May 16, 2019, 6:52 PM IST
ICC World Cup 2019: వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్‌కు వచ్చే 4 జట్లు ఇవే అంటున్న గంగూలీ
సౌరవ్ గంగూలీ (File)
  • Share this:
వరల్డ్ కప్‌కు టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఆయా దేశాల బోర్డులు కూడా తమ టీమ్‌లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్‌కు వచ్చే నాలుగు టీమ్‌లను సౌరవ్ గంగూలీ అంచనా వేశాడు. ఆ నాలుగింటిలో భారత్‌ తప్పకుండా ఉంటుందని చెప్పాడు. ప్రస్తుతం ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్తాన్ జట్లు సెమీస్‌కు చేరే ఛాన్స్ ఉందని దాదా అంచనా వేశాడు. భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన గంగూలీ 2003 వరల్డ్ కప్‌లో టీమ్‌ను ఫైనల్స్ వరకు తీసుకెళ్లగలిగాడు. ప్రస్తుతం వరల్డ్ కప్ అనుసరిస్తున్న రౌండ్ రాబిన్ ఫార్మాట్‌ను బట్టి తాను ఈ అంచనాకు వచ్చినట్టు చెప్పాడు.

‘ప్రపంచ కప్‌లో ఆడడం ఎప్పుడూ టఫ్‌గానే ఉంటుంది. ప్రస్తుతం భారత జట్టు అత్యంత బలంగా ఉంది. ఏ టోర్నమెంట్ అయినా కూడా హాట్ ఫేవరెట్‌గా మారింది. అలాంటి జట్టుకు వరల్డ్ కప్ అనేది బెస్ట్ టోర్నమెంట్. ’ అని తెలిపాడు. ఇటీవల తొమ్మిది మ్యాచ్‌ల్లో నాలుగు వికెట్లు మాత్రమే తీసిన కుల్‌దీప్ యాదవ్ వరల్డ్ కప్‌లో మెరుగైన ప్రదర్శన చూపుతాడని సౌరవ్ గంగూలీ ఆకాంక్షించాడు. ప్రస్తుతం దాదా ఐపీఎల్‌లో ఢిల్లీ కేపిటల్స్‌కు సలహాదారుగా ఉన్నాడు.

First published: April 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>