ధోనీ గురించి ఆ రోజు గంగూలీ చేప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయి: భట్టాచార్య

ప్లేయర్స్ టాలెంట్‌ను గుర్తించడంలో దాదా సమర్ధుడు. ప్రతి ఆటగాడిని గంగూలీ వెన్ను తట్టి పోత్సాహిస్తాడు. ప్రతిభ ఉన్న ప్రతి ఆటగాడు రాణిస్తాడని అతను గట్టిగా నమ్ముతాడన్నారు" జాయ్‌.

Rekulapally Saichand
Updated: July 22, 2020, 4:13 PM IST
ధోనీ గురించి  ఆ రోజు గంగూలీ చేప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయి: భట్టాచార్య
గంగూలీ, ధోని, కోహ్లీ
  • Share this:
భారత మాజీ సారథి,ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మెరికల్లాంటి ఆటగాళ్ళను ప్రోత్సహించడంలో ముందుంటారన్నారు కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ డైరెక్టర్ జాయ్ భట్టాచార్య. తాజాగా గౌరవ్ కపూర్ యూట్యూబ్ షోలో జాయ్‌ భట్టాచార్య మాట్లాడుతూ పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు.

"మహేంద్రసింగ్ ధోనీ స్టార్ ఆటగాడు అవుతాడని గంగూలీ ముందే గుర్తించాడు. 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన ధ్వైపాక్షిక సిరీస్‌లో ధోనీ మెుదటిసారిగా ఆడాడు. ఆ సమయంలో బంగ్లాదేశ్‌‌కు వెళ్లే విమానంలో గంగూలీ తనతో చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయన్నారు జాయ్‌.దాదా.. ధోనీనీ చూపిస్తూ "ఇండియన్ టీంకు మరో విధ్వంసకర బ్యాట్స్‌మన్ అవుతాడు. ధోనీ వీఐపీ అవుతాడు" అంటూ గంగూలీ ఆ రోజు తనతో చేప్పిన విషయాలను చేస్తున్నారు భట్టాచార్య .

ప్లేయర్స్ టాలెంట్‌ను గుర్తించడంలో దాదా సమర్ధుడు. ప్రతి ఆటగాడిని గంగూలీ వెన్ను తట్టి పోత్సాహిస్తాడు. ప్రతిభ ఉన్న ప్రతి ఆటగాడు రాణిస్తాడని అతను గట్టిగా నమ్ముతాడన్నారు" జాయ్‌. ఈ మాజీ డైరెక్టర్ చేప్పినట్టుగానే యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్ వంటి ఆటగాళ్లను జట్టులోకి తీసుకోచ్చి భారత్‌ను ప్రపంచ క్రికెట్ యవ్వనికపై బలమైన టీంగా నిలిపాడు గంగూలీ. టీమిండియా క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలో సారథిగా పగ్గాలు అందుకున్న సౌరవ్ జట్టును తన నాయకత్వ ప్రతిభతో ముందుకు నడిపాడు.
Published by: Rekulapally Saichand
First published: July 22, 2020, 4:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading